RRR కు రాజమౌళి జులై సెంటిమెంట్..!

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ విషయాల గురించి డీటైల్స్ చెప్పడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఆర్.ఆర్.ఆర్ అంచనాలకు మించి ఉండబోతుందని జక్కన్న చెప్పిన కథను బట్టే తెలుస్తుంది. తెలిసిన హీరోల కథలే కాని వారి చరిత్ర గురించి మనకు తెలియని విషయాలను ఫిక్షన్ కథతో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్నారు.

400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా 2020 జూలై 30 రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే రాజమౌళి జూలై సెంటిమెంట్ కోసమే ఈ మూవీని ఆ నెలలో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. రాజమౌళి ఇప్పటివరకు చేసిన 12 సినిమాల్లో 6 సినిమాలు జూలై నెలలోనే రిలీజ్ చేశారు. రాజమౌళి, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి జూలై 9న రిలీజ్ అయ్యింది.. రాజమౌళి డైరక్షన్ లో చరణ్ చేసిన మగధీర మూవీ జూలై 31న రిలీజైంది. వీటితో పాటుగా రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ జూలై 10, ఈగ జూలై 6, మర్యాదరామన్న జూలై 22 ఇలా రాజమౌళి తన సినిమాల్లో ఎక్కువ శాతం జూలై నెలలో రిలీజ్ అయ్యాయి.

వాటి ఫలితాలు ఏంటన్నది అందరికి తెలిసిందే. మరి రాజమౌళి ఈ రకంగా కూడా సెంటిమెంట్ ఫీల్ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news