ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ మెట్రో

ఒకే ప్రాజెక్టులో అత్యధిక పిల్లర్లు నిర్మించిన ఏకైక కంపెనీగా ఎల్ అండ్ టీ అవతరించింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఏ మెట్రో నిర్మాణంలో గానీ…. 2599 పిల్లర్లను నిర్మించింది లేదు.

హైదరాబాద్ మెట్రో… ఎన్నో రికార్డులకు వేదిక. దేశంలో చాలా నగరాల్లో మెట్రో వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని ఏరియాల్లో నిర్మాణంలో ఉంది. కానీ.. అప్పటికే.. హైదరాబాద్ మెట్రో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నది. చరిత్ర సృష్టించింది. ఇండియాలోనే అతి పెద్ద మెట్రోగా అవతరించింది. తాజాగా ప్రపంచ రికార్డును సాధించింది.

Hyderabad metro creates world record

ఒకే ప్రాజెక్టులో అత్యధిక పిల్లర్లు నిర్మించిన ఏకైక కంపెనీగా ఎల్ అండ్ టీ అవతరించింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఏ మెట్రో నిర్మాణంలో గానీ…. 2599 పిల్లర్లను నిర్మించింది లేదు. కానీ.. హైదరాబాద్ 2599 పిల్లర్లను నిర్మించి చరిత్ర సృష్టించారు. అది కూడా మొదటి దశలోనే.

ఎంజీబీఎస్ దగ్గర నిర్మించిన చివరి పిల్లర్ తో కలిపి 2599 పిల్లర్ల నిర్మాణం పూర్తయినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొదటి దశ ప్రాజెక్టులోని 66 కిలోమీటర్ల దూరానికి 2599 పిల్లర్లను నిర్మించారు. దాంట్లో 56 కిలోమీటర్ల దూరం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరో 10 కిలోమీటర్ల దూరం ఈ సంవత్సరం చివరి కల్లా ప్రారంభం కానుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ మార్గం ఇంకా నిర్మాణ దశలో ఉంది.