అసలు ఏపీలో గెలిచేదెవరు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

-

ఒక్క లగడపాటి తప్పించి.. మిగితా సర్వేలన్నీ వైఎస్సార్సీపీకే పట్టం కట్టాయి. ఎలాగూ లగడపాటిది రివర్స్ గేమ్ కాబట్టి.. ఏపీలో అధికారం వైఎస్సార్సీపీదే అని ఖాయం అయిపోయింది.

ఉఫ్.. సగం భారం తగ్గింది. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలామంది ఎదురుచూసింది వీటికోసమే.. అదేనండి.. ఎగ్జిట్ పోల్స్ గురించే మనం మాట్లాడుకునేది. ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న సాయంత్రం వచ్చేశాయి. మీడియా, సర్వే సంస్థలన్నీ కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశాయి. కేంద్రంలో ఎన్డీఏనే మళ్లీ అతిపెద్ద కూటమిగా ఏర్పడబోతున్నదని చాలా సర్వేలు తేల్చాయి. అది మనకు అంత ముఖ్యం కాదు కూడా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది ఏపీ ఎగ్జిట్ పోల్స్ గురించి. ఇక్కడ లోక్ సభ, అసెంబ్లీ.. రెండు ఎన్నికలు జరగడంతో ఏపీలో ఫలితాలపై కాసింత ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది.

Who will win in ap? What exit polls said about ap results?

ఎగ్జిట్ పోల్స్ ఏపీలోకూడా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పాలి. అంకెలతో సహా చెప్పాయి.. కానీ.. అంతా గందరగోళం. ఒక సర్వే.. ఒక పార్టీ గెలుస్తుందని చెబితే.. మరో సర్వే.. మరో పార్టీ గెలుస్తుందని చెప్పడం చూస్తే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్.

పర్ సపోజ్… మన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏమన్నారు.. తన సర్వే ప్రకారం… టీడీపీకి 90 నుంచి 110 సీట్లు వస్తాయన్నారు. వైఎస్సార్సీపీకి 65 నుంచి 79 వస్తాయన్నారు. జనసేన, ఇతర పార్టీలకు ఓ రెండు మూడు వస్తాయని తేల్చారు. అంటే… ఆయన సర్వే ప్రకారం.. టీడీపీ అధికారంలోకి రావాలి. అంతే కదా? అయితే.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఏంటంటే.. లగడపాటి సర్వేలపై ఈమధ్య నమ్మకాలు పోయాయి. ఆయన సర్వేలు ఉత్త బూటకాలు అని ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే తేటతెల్లమైంది. దీంతో ఆయన సర్వేలో ఏ పార్టీ గెలుస్తుందని చెబితే ఆ పార్టీ ఓడిపోతుందని అని జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఈవెన్.. రాజకీయ పార్టీలు కూడా లగడపాటి సర్వేను అలాగే తీసుకుంటున్నాయి. అందుకే.. లగడపాటి చెప్పిన సర్వే ప్రకారం.. దాన్ని రివర్స్ చేస్తే.. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతున్నదన్నమాట. అందులోనూ లగడపాటి.. టీడీపీ నుంచి డబ్బులు తీసుకొని.. పెయడ్ సర్వేలు చెబుతున్నారని కూడా టాక్ వచ్చింది. కాబట్టి.. ఏపీ ప్రజలు లగడపాటి సర్వేను నమ్మే స్థితిలో లేరు. లోక్ సభ స్థానాల్లో కూడా టీడీపీకి 15, వైఎస్సార్సీపీకి 10 వస్తాయని అంచనా వేశారు లగడపాటి.

మరోవైపు ప్రముఖ మీడియా సంస్థ.. ఇండియా టుడే మాత్రం ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం అని తేల్చేసింది. వైఎస్సార్సీపీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి 40 సీట్లు వస్తే గొప్ప అని చెప్పింది. లోక్ సభ స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ 18 నుంచి 20 సీట్లు గెలుస్తుందని.. టీడీపీకి 4 నుంచి 6 వరకు రావచ్చని అంచనా వేసింది.

సీపీఎస్ సర్వే కూడా వైసీపీకే పట్టం కట్టింది. వైసీపీ 130 నుంచి 133 స్థానాలు గెలుచుకుంటుందని.. టీడీపీకి 43 నుంచి 44 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఏతావాతా అర్థమయ్యేదేంటంటే.. ఒక్క లగడపాటి తప్పించి.. మిగితా సర్వేలన్నీ వైఎస్సార్సీపీకే పట్టం కట్టాయి. ఎలాగూ లగడపాటిది రివర్స్ గేమ్ కాబట్టి.. ఏపీలో అధికారం వైఎస్సార్సీపీదే అని ఖాయం అయిపోయింది. అంటే.. చంద్రబాబు తడిగుడ్డ వేసుకొని పడుకోవాల్సిందే. వైఎస్ జగన్.. తన ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కాబోతున్నారు. వచ్చే ఐదేళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెట్టబోతోంది.. అని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news