శృంగారం : మీ భాగస్వామిని సంతృప్తి పరిచే ఫోర్ ప్లే ఐడియాస్..

శృంగారం లో ఫోర్ ప్లే పాత్ర చాలా కీలకం. ఫిన్లాండ్ యూనివర్సిటీ చేపట్టిన సర్వే ప్రకారం ఫోర్ ప్లే లేకుండా భావప్రాప్తి చేరుకోవడం కష్టమని వెల్లడించింది. అందుకే మొదటగా ఫోర్ ప్లేతో మొదలెట్టి, ఆ తర్వాత భావప్రాప్తికి చేరుకోవాలి. ఐతే ఫోర్ ప్లే విషయంలో చాలామందికి అనేక సందేహాలున్నాయి. పడకగదిలో ఎలా ఉండాలన్న విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. అవి తీర్చుకోవడానికి ఎవరినీ అడగరు కూడా. ప్రస్తుతం ఫోర్ ప్లే ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం.

శృంగారం లో ఫోర్ ప్లే పాత్ర

మనస్సును ఉత్తేజపర్చడం

శృంగారం కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. అలా అనుకునే అందులో రసాస్వాదనని ఆనందించలేకపోతున్నారు. శృంగారానికి పడకగది అలంకరణ కూడా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పరుపుపై వేసిన బెడ్ షీట్ కూడా మూడ్ క్రియేట్ చేస్తుంది. సాటిన్ వస్త్రంతో చేసిన బెడ్ షీట్స్, ఎక్కువగా లైటింగ్ లేకపోవడం మొదలగునవి మూడ్ క్రియేట్ చేస్తాయి. అవి ఫోర్ ప్లేకి దారి తీస్తాయి.

స్పర్శ

ఫోర్ ప్లేలో అతి కీలకమైనది స్పర్శ. దాని కారణంగానే అవతలి వారిలో ఆలోచనని రేకెత్తించవచ్చు. మీలో ఆలోచనని అవతలి వారికి తెలియజేసేది స్పర్శ మాత్రమే. స్పర్శలో ముద్దుపెట్టుకోవడం అనేది ముఖ్యమైనది. మీ భాగస్వామిని ఎంతలా ప్రేమిస్తున్నారనే విషయం ముద్దులో తెలిసిపోతుంది.

ఇతర ఆక్టివిటీస్

పైన చెప్పినవన్నీ పడకగదికి సంబంధించినవైతే బయట చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి. ఫోర్ ప్లే అనగానే ఫిజికల్ సంబంధం అనే అనుకుంటే పొరపాటే. భాగస్వామితో పాటు షాపింగ్ కి వెళ్ళడం, కూరగాయల మార్కెట్ కి వెళ్ళడం, వంటలో సాయం చేయడం మొదలైనవన్నీ ఫోర్ ప్లే కిందకే వస్తాయి. ఇవన్నీ కలిసి రాత్రిపూట చక్కటి అనుభూతిని అందిస్తాయి.