బరువు తగ్గితే నగదు బహుమతి..యూకే ఆఫర్‌ కేక..!!

-

బరువు తగ్గడం అనేది పెరిగినంత ఈజీ కాదు.. అసాధ్యం అయితే కాదుగా..గట్టిగా ఫిక్స్‌ అయితే తగ్గేయొచ్చు.. తగ్గేదేలా అనుకుంటే..ఏం చేయలేం..! అయితే చాలా డైట్‌ ప్లాన్స్‌ ఉన్నాయి బరువు తగ్గించుకోవడానికి.. కానీ మనకు ఒక మోటివేషన్‌ ఉండాలి.. ఇన్ని నెలల్లో ఇన్ని కేజీలు తగ్గాలని మనం ఫిక్స్‌ అయితే అందుకు తగ్గట్టుగా ఏదో ఒక తిప్పలు పడతాం..యూకే ప్రభుత్వానికి ఒక కిరాక్‌ ఐడియా వచ్చింది. ఎవ‌రైతే బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తారో వారికి న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి ఆహారంలో భాగంగా తీసుకోవడం, చీజ్, వెన్నె, జంక్ ఫుడ్ పదార్థాలకు దూరంగా ఉండడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే, ఇలా చేయడానికి ప్రజల వద్ద టైమ్ కూడా ఉండటం లేదు. అందుకే, యూకే ప్రభుత్వం ఈ ఐడియాను తీసుకొచ్చిందట..ఆ దేశంలో ఇప్పుడు స్థూల‌కాయం చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌జ‌ల‌కు డైటింగ్ పట్ల అవ‌గాహ‌న క‌లిపించ‌డానికి, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డటానికి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందట..ఈ కొత్త ప్రణాళికకు UK ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతు పలికారు. యూకే ఫిట్‌గా ఉండటానికి ఈ మొత్తం ప్రచారంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తానని తెలిపారు.
యూకేలో పెరిగిపోతున్న స్థూలకాయం..
సర్వేలను గమనిస్తే ప్రస్తుతం అక్కడ ముగ్గురు చిన్నపిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతుంటే, అదే సమయంలో ముగ్గురు పెద్దలలో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. యూకే ప‌త్రిక అయిన ది గార్టియ‌న్ నివేదిక ప్రకారం.. అక్క‌డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకుంటోంది. ప్రజల్లో బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటోంది. అందుకోసం ఎవరైతే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తారో వారికి నగదు రివార్డులను ఇవ్వాలని నిర్ణయించిందట.
యాప్‌ ద్వారా..
ప్రజల జీవనశైలిని పరిశీలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఒక యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా ప్రజలు ఎన్ని పండ్లు, కూరగాయలు తింటున్నారు? ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారు తదితర అంశాలను గమనిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో ఒక కుటుంబం వీటి కోసం ఎంత ఖర్చు చేస్తుందో కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఎంతమంది ప్రజలు జంక్ ఫుడ్‌కి బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి, కొనడానికి ఇష్టపడతారో గమనిస్తారు.. ఈ యాప్ ద్వారా అధిక బరువు గల వ్యక్తులను ఎన్నుకుని, వారికి బరువు తగ్గడంపై వివిధ రకాల కోర్సులకు కూడా వారే పంపిస్తారు. ఈ నిర్వహణ కోర్సులను వెయిట్ వాచర్స్, స్లిమ్మింగ్ వరల్డ్ వంటి సంస్థలు అందిస్తాయి. మొత్తానికి అక్కడి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మంచి విషయమే..! మరి మన దగ్గర..? ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో..దేని మీద శ్రద్ధ పెడుతున్నాయో మీకు బాగా తెలుసు కదా..!!

Read more RELATED
Recommended to you

Latest news