ఆ రోడ్డు ప్రమాదాలకు అధికారులదే బాధ్యత : ఎన్‌హెచ్‌ఏఐ

-

రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తేలితే దానికి సంబంధించిన అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందం లేదా పాలసీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడి సర్టిఫికెట్‌ జారీ చేస్తే విధుల ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది. అలా చేసిన ఎన్‌హెచ్‌ఏఐ/ఐఈ/ఏఈ విభాగాలకు చెందిన అధికారులు/ప్రతినిధులపై చర్యలు తప్పవని క్లారిటీ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసీ నిబంధనలు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వ్యవహరించొద్దని తెలిపింది.

రోడ్డు నిర్మాణంలో ప్రధాన పనులు పూర్తయ్యి.. చిన్న చిన్న తుది మెరుగులు ఇంకా చేయాల్సి ఉన్నప్పుడు వాటిని ‘పంచ్‌ లిస్ట్‌’లో చేర్చి సర్టిఫికెట్‌ జారీ చేస్తుంటారు. అయితే, ఆ పనుల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేది నిబంధన. వాటిని సర్టిఫికెట్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని చోట్ల ప్రధాన పనుల్లో భాగమైన కొన్ని కీలక అంశాలను సైతం పంచ్‌ లిస్ట్‌లో చేర్చి సర్టిఫికెట్‌ పొందుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ దృష్టికి వచ్చింది. దీని వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news