జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితాంతం ఇద్దరూ కలిసి ఉండాలి. కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచార్య చాణక్య ఇలాంటి స్త్రీ భార్య దొరికితే వదులుకోకూడదని చెప్పారు. అయితే మరి ఆ లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం.
భార్యను ఎంపిక చేసుకునే విషయం లో సహజంగా ఉండే స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సహజంగా ఉండే స్త్రీ కనుక మీ జీవితంలోకి రాబోతు ఉంటే ఆ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఇటువంటి వాళ్లు ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా సరే ఓపికతో ఉంటారు. అనవసరమైన విషయాలకి సహనంగా ఉండే స్త్రీలు ప్రాధాన్యత ఇవ్వరు.
ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే ఇలాంటి స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలానే మంచితనంతో మర్యాదగా మాట్లాడే స్త్రీని కూడా వదులుకోకండి. ఇలాంటి జీవిత భాగస్వామి రావడం అదృష్టం. ఇలాంటి స్త్రీల వల్ల కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
పైగా ఈ మహిళలు సరైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. పిల్లలకి మంచి విద్యను కూడా అందించేలా చూస్తారు. కాబట్టి వీళ్లు కనుక మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే అస్సలు ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.