రాష్ట్ర ప్రయోజనాలకు ముందుకువచ్చే వారితోనే పొత్తు… వైసీపీ ఓట్లు చీల్చనివ్వం: పొత్తులపై పవన్ క్లారిటీ

-

రాజకీయ ప్రయోజనాలు వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేఖ ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమని ఆయన అన్నారు. అధికార మదంతో .. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపి అనే మహిషానికి కొమ్ములు ఇరగ్గొట్టి.. కింద కూర్చోబెట్టి… వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని… ఇదే జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం అని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేఖ శక్తులు కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని.. మీరు రోడ్ మ్యాప్ ఇస్తే ఈ వైసీపీ పాాలనను గద్దెదించాలో…మేం చేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని చెప్పారని.. నేను దాని కోసమే ఎదురుచూస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ముందుకువచ్చినప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. నేను నలుగురికి ఇచ్చేవాడినని.. ఎవరిదగ్గరి నుంచి ఏం ఆశించే వారిని కాదని.. నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. వైసీపీది విధ్వంసం.. మనది ఆత్మగౌరవం అంటూ నినదించారు. దోపిడి చేసే వైసీపీ గుండాగాళ్లు ఉంటే.. దాన్ని అడ్డుకునే జనసైనికులు ఉంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news