ఎయిర్‌పోర్ట్‌లో మిస్‌ అయిన సూట్‌కేస్‌ నాలుగేళ్ల తర్వాత తిరిగివస్తే..

-

పోయిందనుకున్న వస్తువు మళ్లీ కనిపిస్తే.. భలే హ్యాపీగా ఉంటుంది కదా.. ఇంట్లో కూడా అప్పుడప్పుడు కొన్ని వస్తువులు ఎంత వెతికినా కనపించవు.. ఇక అవి ఎక్కడో మిస్‌ అయిపోయాయి అని వాటిమీద ఆశలు వదిలేసుకున్నాక సడన్‌గా ఒకరోజు కనిస్తాయి.. అప్పుడు వచ్చే ఆనందమే వేరు.. అలాంటిది పోయిందనుకున్న సూట్‌కేసు నాలుగేళ్ల తర్వాత కనిపిస్తే.. ఎయిర్‌పోర్ట్‌లో మన లగేజ్‌ను ఎలా ఇస్తారో అందరికీ తెలుసిందే..! నాలుగేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం చికాగో లోని ఎయిర్ పోర్ట్‌లో ఆరెగావ్‌కు చెందిన అప్రిల్ గేవిన్ అనే మహిళ తన లగేజీని పోగొట్టుకుంది.

అప్పుడు పోగొట్టుకున్న ఆ లగేజీ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీస్‌ను, యునైటెడ్ ఎయిర్ లైన్స్‌ను కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా సంప్రదించింది. తన మిస్సింగ్ సూట్ కేసు గురించి సోషల్ మీడియాలోనూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అన్ని ప్రయత్నాలు చేశామని, ఆ లగేజీ ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదని యునైటెడ్ ఎయిర్ లైన్స్ సమాచారం ఇచ్చింది.. దాంతో, ఇక ఆ సూట్ కేస్ దొరకదని నిర్ణయానికి వచ్చిన అప్రిల్ గేవిన్.. దానిపై ఆశలు వదిలేసుకుంది.

నాలుగేళ్ల క్రితం బిజినెస్ ట్రిప్‌పై చికాగో వెళ్లి ఆరెగావ్ తిరిగి వస్తుండగా పోగొట్టుకున్న లగేజీ.. నాలుగేళ్ల తరువాత హోండురస్‌లో లభించింది. టెక్సస్‌లోని హ్యూస్టన్ నుంచి ఆ సూట్ కేసు సమాచారంతో గతవారం ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆ సూట్ కేసును తాము హోండురస్‌లో గుర్తించామని, అందులోని అడ్రస్ ప్రకారం కాల్ చేస్తున్నామని, ఆ అడ్రస్‌కు సూట్ కేసును పంపిస్తున్నామనేది ఆ ఫోన్ సారాంశం. చికాగోలో పోగొట్టుకున్న లగేజీ హోండురస్‌కు, అక్కడి నుంచి హ్యూస్టన్‌కు ఎలా వెళ్లిందని ఆమె ఆశ్చర్యపోయింది. నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడో ప్రయాణించి, తిరిగొచ్చిన తన లగేజీని చూసుకుని ఆనందాశ్చర్యాలలో మునిగిపోయింది ఆ మహిళ… సూట్ కేస్ బాగా పాడయిపోయింది కానీ, అందులోని తన వస్తువులన్నీ సరిగ్గానే ఉన్నాయని తెలిపింది.. మొత్తానికి అలా ఎక్కడెక్కడో ట్రావల్‌ చేసి చివరకి సూట్‌ కేస్‌ సొంతగూటికి చేరిందనమాట..! ఇంతకీ అలా ఎలా జరిగిందో ఆ మహిళకు, ఈ విషయం తెలిసిన నెటిజన్లకు అర్థంకావడం లేదు..!

Read more RELATED
Recommended to you

Latest news