ఆధార్ కార్డు ఉంటే చాలు.. 30 వేలు మీవే..!

-

మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే మీరు 30 వేల రూపాయల బహుమతి గెలుచుకునే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. మై ఆధార్ ఆన్‌లైన్ కంటెస్ట్‌లో పాల్గొంటే చాలు.. మీరు 30 వేలు గెలుచుకోచ్చు. జులై 9 వరకు ఈ కంటెస్ట్ ఉంటుంది. ఇంతకీ మేం ఏం చేయాలి అంటారా?

ఏం లేదు.. మీరు ఓ షార్ట్ ఫిలిం తీసి వాళ్లకు పంపించాలి. ఎలా అంటే.. ఆధార్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి… ఆధార్ అప్‌డేట్ స్టాటస్, లొకేట్ ఆధార్ సెంటర్, ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్, అడ్రస్ వాలిడేషన్ లెటర్ రిక్వెస్ట్, ఆధార్ అప్‌డేట్ హిస్టరీ, యూఐడీ, ఈఐడీ రికవరీ, ఆధార్ రీప్రింట్ ఆర్డర్, ఆధార్ లాక్, అన్‌లాక్, ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ, ఆధార్ ఆన్‌లైన్ వెరిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ జనరేషన్, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్, ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్.. లాంటి అంశాలపై మీరు షార్ట్ వీడియో తీసి యూఐడీఏఐకి పంపించాలి.

వీడియో కూడా కేవలం 30 సెకన్ల నుంచి 120 సెకన్ల మధ్యలో ఉండాలి. పై అంశాల్లో ఏదో ఒక అంశం మీద మాత్రమే వీడియో ఉండాలి. మీకు యానిమేషన్ మీద పట్టు ఉంటే.. యానిమేషన్ వీడియోలు కూడా చేయొచ్చు. మీరు తీసిన వీడియోను గూగుల్ డ్రైవ్‌లో లేదా యూట్యూబ్ లేదా.. ఏదైనా ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫాంలో షేర్ చేసి… ఆ లింక్‌ను media.division@uidai.net.in కు మెయిల్ చేయాలి. మీ షార్ట్ వీడియో లింక్‌తో పాటు.. అందులో మీ ఆధార్ నెంబర్, అడ్రస్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందించాలి.

మీ వీడియో సెలెక్ట్ అయితే వాళ్ల మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆగస్టు 31 లోపు ఈమెయిల్ చేస్తారు. మీకు మెయిల్ రాలేదంటే మీరు సెలెక్ట్ కాలేదని అర్థం. ఇందులో ఉన్న 15 కేటగిరీల్లోని టాప్ 3 వీడియోలకు బహుమతులు అందిస్తారు. వాటిలో టాప్ వన్‌కి 20 వేలు, టాప్ టూకి 10 వేలు, టాప్ త్రీకి 5 వేలు ఇస్తారు.

మొత్తం వీడియోల్లో టాప్ 3ని సెలెక్ట్ చేసి.. మొదటి స్థానంలో ఉన్న వీడియోకు 30 వేలు, రెండో స్థానంలో ఉన్న వీడియోకు 20 వేలు, మూడో స్థానంలో ఉన్న వీడియోకు 10 వేలు ఇస్తారు. సోషల్ మీడియాలో విన్నర్స్‌ను ప్రకటిస్తారు. ఒకవేళ మీరు గెలిస్తే మీరు పంపించిన అకౌంట్‌కు డబ్బులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version