ఫోన్ల‌లో బాగా మాట్లాడుతున్నారా..? అయితే మీకు కొమ్ములు వ‌స్తాయ‌ట‌.. ఇది నిజ‌మే..!

-

అధికంగా సెల్‌ఫోన్ల‌లో మాట్లాడ‌డం వ‌ల్ల మ‌న‌కు కొమ్ములు మొలుస్తాయ‌ట‌. అవును, నిజ‌మే.. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

సెల్‌ఫోన్ల వ‌ల్ల రేడియేష‌న్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని.. దాంతో మ‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఇప్ప‌టికీ అనేక మంది వైద్యులు చెబుతూనే ఉన్నారు. ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది కూడా. అయితే ఇప్పుడు ఆ సైంటిస్టులే సెల్ ఫోన్ల అతి వాడ‌కం వ‌ల్ల మ‌రో అన‌ర్థం క‌లుగుతుంద‌ని తేల్చారు. ఇంత‌కీ ఆ న‌ష్టం ఏమిటంటే.. అధికంగా సెల్‌ఫోన్ల‌లో మాట్లాడ‌డం వ‌ల్ల మ‌న‌కు కొమ్ములు మొలుస్తాయ‌ట‌. అవును, నిజ‌మే.. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

సాధార‌ణంగా మనం ఫోన్ మాట్లాడేట‌ప్పుడు మ‌నకు తెలియ‌కుండానే త‌ల‌ను వెన‌క్కి లేదా ప‌క్క‌కు వంచుతాం క‌దా.. అయితే దీని వ‌ల్ల బ‌రువు అంతా త‌ల‌పై ప‌డి వెనుక భాగంలో ఉండే లిగ్మెంట్ వ‌ద్ద ఎముక మొలుస్తుంది. ఇది సుమారుగా ప‌క్షి ముక్కంత సైజ్ ఉంటుంది. అంటే ఈ ఎముక పొడ‌వు దాదాపుగా 10 మిల్లీమీట‌ర్లు ఉంటుంద‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని చిరో ప్రాక్ట‌ర్ డేవిడ్ స‌హాహ‌ర్ అనే సైంటిస్టు ఓ ప్ర‌ముఖ విదేశీ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇక ఈ విధంగా త‌ల వెనుక భాగంలో కొమ్ములా ఎముక మొల‌వ‌డానికి కార‌ణం అతిగా సెల్‌ఫోన్ల‌లో మాట్లాడ‌డ‌మే అని సైంటిస్టులు తేల్చారు.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల‌ను ఎక్కువ‌గ వాడేవారికి, వాటితో ఎక్కువ‌గా కాల్స్ చేసే వారికే ఇలా త‌ల వెనుక ఎముక మొలుస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ కొమ్ము వ‌ల్ల ప్ర‌స్తుతం వారికి వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేక‌పోయిన‌ప్ప‌టికీ రాను రాను వారి త‌ల ఆకృతి మారుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం దాదాపుగా 41 శాతం మంది యువ‌త‌లో ఈ స‌మ‌స్య ఉంద‌ని వారు తేల్చారు. క‌నుక ఫోన్ మాట్లాడేట‌ప్పుడు ఎవ‌రైనా సరే వీలైనంత వ‌ర‌కు త‌ల‌ను నిటారుగా ఉంచాలి. లేదంటే.. పైన చెప్పాం క‌దా.. కొమ్ములు వ‌స్తాయి..! ఆ త‌రువాత మీ ఇష్టం మ‌రి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version