ఆనందం కావాలంటే నీ జీవితాన్ని ఒప్పుకుని తీరాల్సిందే అని చెప్పే కథ..

-

ఒకానొక ధనవంతుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఏదీ మనసుకి ప్రశాంతతకి ఇవ్వలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో విఫలం అవుతుండేసరికి చాలా బాధకి గురయ్యేవాడు. జీవితంలో ఇంత డబ్బు సంపాదించాను. అయినా కూడా ఇలా ఎందుకు మారిపోయాను. ఆనందం అనేది నాకెందుకు దొరకట్లేదనుకుని, ఒకసారి దారిన పోయే సన్యాసులను కలుసుకుని ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు.

దానికి వారు ధ్యానం చేయాలి అని చెప్పాడు. అంతే చాళ్ళు చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత కొద్దిగా మార్పు కనిపించినప్పటికీ ప్రశాంతత మాత్రం రాలేదు. మునుపటి కంటే స్ట్రాంగ్ గా తయారయ్యాడు కానీ ఆనందం మాత్రం అంతంత మాత్రమే. ఆనందం గురించి చేస్తున్న అన్వేషణలో అతనికి చిరాకు ఎక్కువ అవసాగింది. అప్పుడు సరాసరి ఆ సన్యాసులు ఉండే చోటికి వెళ్ళాడు. నాకు ప్రశాంతత ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించాడు.

దానికి ఆ సన్యాసి, పైన ఉన్న నా శిష్యులని అడుగు అన్నాడు. ఆ వ్యక్తి పైకి వెళ్ళి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అపుడు శిష్యుడు చెప్పిన సమాధానం విని వ్యక్తి షాకయ్యాడు. ప్రశాంతంగా జీవించాలంటే జీవితంలో ఏది ఎదురైనా ఒప్పుకునే ధైర్యం కావాలి. నీకు కావాల్సినట్టుగా జరగకపోయినా దాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే జీవితం అనేది నది లాంటిది. ఎక్కడ ఎత్తుగా ఉంటుందో, ఎక్కడ పల్లంగా ఉంటుందో. ఎక్కడ సాఫీగా సాగుతుందో చెప్పలేం. ఎత్తువంపులు వచ్చినప్పుడల్లా చిరాకు పడుతూ కూర్చుంటే ఆనందం దొరకదు.

నదికి వంపులు కామన్ అని తెలుసుకోగలిగితే జీవితంలో ఏ కష్టం వచ్చినా ప్రశాంతతని కోల్పోకుండా ఉండగలుగుతాం.. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా..

Read more RELATED
Recommended to you

Latest news