టాప్‌-3లోకి ఇండియా..

-

టాప్‌3లోకి ఇండియా..
రానున్న రెండు దశాబ్దాల్లో మనదేశం టాప్‌3 ఆర్థిక వ్యవస్థలో ఒక్కటిగా ఉంటుందని పారిశ్రామి వేత్త ముకేశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదాయం రెండింతలు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఫేస్‌బుక్‌ ఫ్యూయర్‌ ఫర్‌ ఇండియా2020’ కార్యక్రమంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. దేశం మొత్తంలో 50 శాతం పైగా ఉండే మధ్య తరగతి కుటుంబాల సంఖ్య సంవత్సరానికి మూడు నుంచి నాలుగు శాతం వరకు అభివద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్‌లో ఇండియా ఆర్థికంగా, సామాజికంగా వద్ధి చెంది ప్రపంచ వ్యాపంప ఔత్సాహిక వ్యాపార వేత్తలకు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాడానికి ఇదోక సువర్ణవకాశం అని పేర్కొన్నారు. ఇదంతా కచ్చితంగా జరిగేదేనని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

దీటుగా ఎదుర్కున్నాం..

ప్రపంచాన్ని గడగడ వణకించిన కరోనా మహమ్మారి కోవిడ్‌ సంక్షోభాన్ని దేశం దీటుగా ఎదుర్కుందన్నారు. కోవిడ్‌ కాటుతో అందిరీలాగా దేశ ప్రజల్ని కలవరపరిచింది. కానీ..’ సంక్షోభాన్ని వెరవడమన్నది భారతీయుల డీఎన్‌ఏలో లేదేమో.. అందుకే దాన్ని సమష్టిగా ఎదుర్కున్నామన్నారు.’ వచ్చే ఏడాదిలో టీకాల కార్యక్రమానికి భారత్‌ శ్రీకారం చుట్టనుందన్నారు.

డిజిటల్‌తో ఎంతో లబ్ధి..

డిజిటల్‌ ఇండియా నినాదంలో కనెక్టివిటీ పెరగడంతో కరోనా కాలంలోని పరిస్థితులను ఎదుర్కున్నట్లు అంబానీ తెలిపారు. డిజిటలైజేషన్‌తో అందరికీ సమానమైన సంపద, ఫలాలు అందుతాయన్నారు. దేశ ప్రజలు, దేశియంగా చిన్నచిన్న వ్యాపార సంస్థలకు ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యం ఎంతో లబ్ధి చేకూరుస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news