ఆరోగ్యం కావాలి.. కానీ రుచి వదలరు.. కరోనా తర్వాత భారతీయుల ఆహార అలవాట్లు..

-

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అందరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు అసలు దాని గురించి ఆలోచించని వారు కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎంత మేలు చేస్తుందో తెలుసుకున్నారు. దానికి కావాల్సిన ఆహార పదార్థాలేంటో కనుక్కున్నారు.

వ్యాయామం చేయడం ఎంతలా పనికొస్తుందో అర్థం చేసుకున్నారు. ఐతే పైన చెప్పినదంతా ఫాలో అవుతుంది చాలా తక్కువ మంది మాత్రమే. అందరికీ ఆరోగ్యంపై ఇంట్రెస్ట్ కలిగిన మాట నిజమే. కానీ తీసుకునే ఆహారంలొ పెద్దగా మార్పులు రాలేదు. ఆహారంలో రుచికి ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. పోషకాలు కలిగి ఉండి, రుచి ఉంటేనే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. రుచిగా లేని అధిక పోషక విలువలున్న వాటిని పక్కన పెడుతున్నారు.

జిమ్ కి వెళ్ళడం కంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని చూసే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ముందు ఉన్న ఆహార అలవాట్లని తగ్గించినప్పటికీ, రుచిలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదట. ఈ మేరకు రెండు వేల మందిపై చేసిన సర్వేలో వెల్లడైంది.

మొత్తం సర్వేలో 72శాతం మంది తినడానికి సరైన టైమ్ లేక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారట. 66శాతం మంది రుచిగా లేకపోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెడుతున్నారట. మొత్తం 2048మందిపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సంవత్సరానికి 10లక్షలకై పైగా ఆదాయం ఉన్న 22-54 సంవత్సరాల వయసున్న వారిపై చేసిన ఈ సర్వేలో చాలా మందికి సరైన టైమ్ లేక, వారి జీవన విధానం సరిగ్గా లేక, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news