వావ్.. ఇండియాలోనే ఫస్ట్ పెంగ్విన్ ముంబైలో జన్మించింది.. అదీ ఇండిపెండెన్స్ డే రోజు..!

-

ఇండిపెండెన్స్ డే అనేది మనకు చాలా స్పెషల్ రోజు. అదే రోజు ఇంకో స్పెషల్ జరిగితే ఎలా ఉంటది? వావ్.. సూపర్ గా ఉంటది అంటారా? అవును.. ఇండిపెండెన్స్ డే రోజున ముంబైలోని బైకల్లా జూలో ఓ అద్భుతం జరిగింది. ఇండియాలోనే మొట్టమొదటి పెంగ్విన్ జన్మించింది. ఫ్లిప్పర్, ఎంఆర్ మోల్ట్ అనే పెంగ్విన్లకు పెంగ్విన్ పిల్ల జన్మించింది. జులై 2016 లో దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి హమ్ బోల్ట్ జాతికి చెందిన ఈ పెంగ్విన్ లను ముంబై జూకు తీసుకొచ్చారు.

గత బుధవారం రాత్రి మొట్టమొదటి పెంగ్విన్ భూమ్మీదకు అడుగు పెట్టింది. గుడ్డును పగులగొట్టుకొని అది బయటికి వచ్చింది. మోల్ట్ తో సంభోగం జరిపిన తర్వాత ఫ్లిప్పర్ గుడ్డును జులై 5 న పెట్టింది. వీటి కోసం ప్రత్యేకంగా మంచుతో కూడిన ఎన్ క్లోజర్ ను జూ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా 1700 చదరపు గజాల ఎన్ క్లోజర్ లో వీటిని ఉంచారు. అప్పటి నుంచి ఆ గుడ్డును 40 రోజులు పొదిగిన తర్వాత పెంగ్విన్ పిల్ల పుట్టింది.

ఇక.. ఈ బుల్లి పెంగ్విన్ పుట్టగానే చాలా యాక్టివ్ గా ఉందని.. తల్లి పెంగ్విన్ కూడా దానికి ఆహారం అందిస్తుందని జూ ఇన్ చార్జ్ డైరెక్టర్ సంజయ్ త్రిపాఠి తెలిపారు. అయితే.. జూలో ఉన్న మొత్తం ఏడు హంబోల్ట్ పెంగ్విన్లలో ఫ్లిప్పర్ ను చూడటానికే ఎక్కువ మంది సందర్శకులు వస్తుంటారని సంజయ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news