ఇప్పుడే అందిన వార్త. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఐన్యూస్ చానెల్‌ను టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేజిక్కించుకున్నారట. రేపటి నుంచి ఐన్యూస్ చానెల్‌లోకి కొత్త యాజమాన్యం రాబోతున్నదట. ఇప్పటికే రవిప్రకాశ్ మోజో చానెల్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు మోజో, ఐన్యూస్.. రెండు చానెళ్లను.. రవిప్రకాశ్ కొత్త టీమ్‌తో నడిపిస్తారట.
మరోవైపు రాజ్ న్యూస్ చానెల్ కోసం వైఎస్సార్సీపీ(ఎంపీ విజయసాయిరెడ్డి) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 99 టీవీ, స్టూడియో ఎన్‌ను కూడా చేజిక్కించుకోవడం కోసం వైఎస్సార్సీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట.
అయితే.. ఏపీలో ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందా.. మీడియా సంస్థల యాజమాన్యం చకచకా మారిపోతుండటంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ను తీసేసిన ఒక్కరోజులోనే మరో మీడియా హౌజ్‌ను చేజిక్కించుకున్నాడు రవిప్రకాశ్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చానెల్స్ ఉన్నాయి. చూద్దాం.. మున్ముందు ఏం జరగబోతోందో.