గోపీచంద్‌, నాగశౌర్య, నాగచైతన్య.. ‘మెహరీన్‌’కి బంపర్‌ ఆఫర్స్‌!

-

‘ఎఫ్‌2’లో మరింత గ్లామర్‌ డోస్‌ పెంచి కుర్రకారుకి నిద్ర పట్టనీయకుండా చేసింది మెహరీన్‌. అదే సమయంలో తమన్నాకి పోటాపోటీగా నటించి నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్‌ చేసినా మెహరీన్‌కి ఛాన్స్‌లు వెంటనే వచ్చి పడలేదు.

మన సినిమాల్లో హీరోయిన్‌ అంటే మొన్నటి వరకు అలా పాటల్లో మెరిసి, ప్రేమ పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేవారు. మధ్య మధ్యలో ఎప్పుడో ఒకటిరెండు సీన్స్‌లో మెరిసి హడావుడి చేయడం పరిపాటి. కానీ ఇటీవల‌ ట్రెండ్‌ మారింది. హీరోయిన్ అంటే అందానికే పరిమితం కాదు, అంతకుమించి అనేలా కాస్త తన నటనా ప్రతిభతోనూ మెప్పిస్తున్నారు.

mehreen gets bumper offers now in tollywood after f2 movie

పంజాబీ బ్యూటీ మెహరీన్‌ కూడా అలానే అడుగు వేస్తుంది. ఆమె నాని హీరోగా రూపొందిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగులోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సాంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపించి క్యూట్‌ అందాల‌తో మెప్పించింది.

ఆ తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచుతూ వచ్చింది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘జవాన్‌’, ‘పంతం’లో నటన కంటే గ్లామర్‌కే ఎక్కువ‌గా ప్రయారిటీ ఇచ్చింది. హాట్‌ హాట్‌గా ఆడియెన్స్ ని మైమరపించింది. ఇటీవల‌ ‘ఎఫ్‌2’లో మరింత గ్లామర్‌ డోస్‌ పెంచి కుర్రకారుకి నిద్ర పట్టనీయకుండా చేసింది. అదే సమయంలో తమన్నాకి పోటాపోటీగా నటించి నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్‌ చేసినా మెహరీన్‌కి ఛాన్స్‌లు వెంటనే వచ్చి పడలేదు.

భారీ హిట్ రావ‌డంతో మెహరీన్‌ ఇక టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయిపోతుందుకున్న సినీ వర్గాలని షాక్‌కి గురి చేసింది. దాదాపు నాలుగు నెల‌ల‌ తర్వాత ఆమెకు ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. వ‌రుస‌గా ప్ర‌జెంట్ బంపర్‌ ఆఫర్స్‌ అందుకుంటోంది. ఇటీవలే ‘పంతం’ తర్వాత మరోసారి గోపీచంద్‌ సరసన నటించే ఛాన్స్ ని అందుకుంది. తిరు సుబ్రమణ్యం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఇందులో తమన్నాని అనుకున్నారు. రెమ్యూనరేషన్‌ విషయంలో వచ్చిన బేధాభిప్రాయా వ‌ల్ల ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో మెహరీన్ ని ఫైనల్‌ చేశారు. దీంతోపాటు తాజాగా నాగశౌర్య సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

డెబ్యూ డైరెక్టర్‌ రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ‌నివారమే ప్రారంభమైంది. ఇందులో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని, ఆమె చుట్టూనే కథ రన్‌ అవుతుందని చిత్ర వర్గాలు చెప్పాయి. మరోవైపు నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఓ నూతన దర్శకుడు రూపొందించే ల‌వ్‌ ఎంటర్‌టైనర్‌లో మెహరీన్ ని ఫైనల్‌ చేశారట. దిల్‌రాజు నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఇలా వరుసగా బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు బంపర్‌ ఆఫర్స్ అందుకుని మళ్ళీ పుంజుకుంటోంది మెహరీన్‌. తన సొంత భాష పంజాబీలో కూడా ఓ ఫిల్మ్ చేస్తుండ‌టం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news