స్ఫూర్తి: పోలియో ఉన్నా కూడా మొదటి ఎటెంప్ట్ లోనే సీఏ క్లియర్ చేసింది… ఈమె సక్సెస్ ని చూస్తే మెచ్చుకుంటారు..!

-

కొంతమందిని జీవితంలో మనం ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా పైకి రాగలము. మనకి ఉండే చిన్న చిన్న ఇబ్బందులు వలన మనం అనుకున్నది సాధించలేము అని మనం వెనకబడిపోతూ ఉంటాము. ప్రతి చిన్న సమస్యను కూడా పెద్దదానిగా భావిస్తూ ఉంటాము కానీ నిజానికి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు కూడా జీవితంలో సక్సెస్ ని అందుకుంటున్నారు.

శిల్పా మెహతా జైన్ ముంబైలో పుట్టారు చిన్నప్పుడే ఆమెకి పోలియో రావడం వలన లైఫ్ లో ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు ఇతర విద్యార్థులతో ఆమె ఆటలాడలేకపోయేవారు అలానే చాలా మంది మీ పిల్లకి పెళ్లి చేయాలంటే ఎక్కువ కట్నం ఇవ్వాలని అనే వారిని ఆమె చెప్పారు.

అయితే ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే జీవితంలో ముందుకు వెళ్లలేము అనుకోవడం పొరపాటు శిల్పా 94% పోస్ట్ పోలియో సిండ్రోమ్ తో పెరిగారు. కానీ ఆమె జీవితంలో సక్సెస్ ని అందుకోలేనని ఎప్పుడూ అనుకోలేదు. పదో తరగతిలో 82% 12వ తరగతిలో 75% తో పూర్తి చేసారు. కాంపిటేటివ్ పరీక్షలకి కూడా ప్రిపేర్ అయ్యారు.

కానీ ఆర్టికల్ షిప్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఆమె చాలా చోట్ల అవకాశాన్ని పొందలేకపోయారు. కారణం ఆమె ఆరోగ్య పరిస్థితి. అలానే ఆమె డ్రైవింగ్ నేర్చుకున్నారు స్విమింగ్, పారాగ్లైడింగ్ అంటే కూడా ఆమెకి ఆసక్తి ఎక్కువ.

ఆమె భర్తకి ఆమె ఆరోగ్య పరిస్థితి అసలు సమస్య కాదు ఆమెని ఎంజాయ్ చేయమని అతను చెప్పేవారట పైగా ఆమె చాలామంది అంగవైకల్యం ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారు కూడా మొదటి అటెంప్ట్ లోనే సీఏ ని క్లియర్ చేసేసారు నిజంగా ఎంత గొప్ప విషయము కదా జీవితంలో ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. కానీ దానిని తలుచుకు బాధపడుతూ ఉంటే అనుకున్న వాటిని సాధించలేము. ఈమెలా ధైర్యంగా ముందడుగు వేస్తే కచ్చితంగా సక్సెస్ ని అందుకోగలము.

Read more RELATED
Recommended to you

Latest news