Breaking: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా.. ఐదుగురు ఏకగ్రీవం

-

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూ.గో ఎమ్మెల్సీగా కె.సూర్యనారాయణ, కడప ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీగా డా.సుబ్రహ్మణ్యం, అనంతపురం ఎమ్మెల్సీగా మంగమ్మ, నెల్లూరు ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే..కష్టపడ్డా గుర్తింపు లేదని గుస్సా.. టైం చూసి షాక్ ఇచ్చే ధోరణిలో భంగపాటు నేతలుస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో కాకరేపుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతుందంటూ పలు సామాజిక వర్గాలు బాహటంగానే అధిష్టానంపై నిరసనగళం విప్పుతున్నాయి. అనంతపురం జిల్లాలో కురుబ, బోయ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి.

పార్టీ గెలుపులో దాదాపు ఈ రెండు సామాజిక వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయి. జిల్లాలో కురుబ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉషాశ్రీచరణ్‌కు అవకాశం దక్కింది. హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్‌కు అవకాశం ఇచ్చారు. ఇక బోయ సామాజిక వర్గం నుంచి తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఉన్నారు. అటు కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా గుమ్మనూరు జయరాం కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత లేదని పలు సామాజికవర్గాల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news