ఛీ..ఛీ..ఇదేం పాడుబుద్ది..దారుణం..

-

ఒకప్పుడు వింత రోగాలతో జనాలు పోయేవారు..కానీ ఇప్పుడు మనుషుల కక్కుర్తికి పోతున్నారు.. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు..ఎలాగంటే ఆఖరికి మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి యూపి లో వెలుగుచూసింది.. డెంగీతో బాధపడుతున్న రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్‌ బ్యాంక్‌ బత్తాయి జ్యూస్‌ను సరాఫరా చేసిందనే వార్త కలకలం రేపింది.

అనారోగ్యం తో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసిందనేది ఆరోపణ. బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్‌ సింగ్‌ అనే నెటిజన్‌ ట్వీట్ చేశాడు. బ్లడ్‌ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ కనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రయాగ్‌రాజ్‌ లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్‌ ఆసుపత్రిలో స్కామ్‌ అని ఓ వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది. ఆసుపత్రి తో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్‌ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక బత్తాయి జ్యూస్‌ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని, ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

ఇది ఇలా ఉండగా.. స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news