ప్రపంచంలోనే వింత మూఢనమ్మకాలు.. చ్యూయింగ్‌గమ్ నైట్ తింటే శవాలను తిన్నట్లేనట..!

-

సైన్స్ ఎంత డవలప్ అవుతున్నప్పటికీ.. ఈనాటికి కొన్ని మూఢనమ్మకాలను ప్రజలు బలంగా విశ్వసిస్తూనే ఉంటారు. వాటికి శాస్త్రీయంగా కారణాలు ఏంటని తెలియదు కానీ.. ప్రపంచంలో కొన్ని వింతైన నమ్మకాలు ఉన్నాయి. ఈరోజు అవేంటూ చూద్దాం.. ఇవి కచ్చితంగా మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి.
రష్యాలో ఎవరికీ పసుపు రంగు పూలు ఇవ్వకూడదు. వాళ్లు వాటిని విభజించేవిగా, మరణంతో సమానమైనవిగా భావిస్తారట.
బ్రిటన్‌లో ప్రజలు దెయ్యాలొచ్చాయని ప్రజలు భావించినప్పుడు.. ఇంటి తలుపులు లేదా చెక్క వస్తువులపై చేతులతో కొడతారు. ఆ శబ్దాలకు దెయ్యాలు పారిపోతాయని నమ్ముతారు.
వేళ్లను ఒకదానికొకటి మడతపెడితే అదృష్టం కలుగుతుందని పశ్చిమ యూరప్ దేశాల్లో నమ్ముతారు. చూపుడువేలు, మధ్య వేలును మడతపెడతారు.
దక్షిణ అమెరికాలో పెళ్లి కాని వారి కాళ్లపై చీపురుతో ఊడ్చితే.. ఇక వారికి జీవితంలో పెళ్లి కాదని నమ్ముతారు. అలా జరిగినవారు వెంటనే చీపురుపై ఉమ్మి వేస్తే ఏమీ కాదని భావిస్తారు.
యూరప్ దేశాల్లో ప్రజలకు భుజం పైనుంచి ఉప్పును విసిరే అలవాటు ఉంది. ఫలానా వ్యక్తికి దెయ్యం పట్టింది అని భావించినప్పుడు… ఆ వ్యక్తి భుజాల పైనుంచి ఉప్పును విసురుతారట. దెయ్యాలు భుజాలపై వాలి ఉంటాయని వారి నమ్మకం. ఉప్పుతో అవి పోతాయని అంటారు.
ఈజిఫ్టులో గోడకు ఆనించివున్న నిచ్చెన కింద నుంచి నడిచి వెళ్లరు. అలా వెళ్తే… తీవ్రమైన చెడు జరుగుతుందనీ, అది అతి భయంకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇది మన దగ్గర కూడా నమ్ముతారు. నైట్ అయితే నిచ్చెన ఎక్కకూడదని కూడా అంటారు కదా..!
యూరప్ దేశాల్లో పగిలిన అద్దాలను ఇళ్లలో ఉంచరు. ఉంచితే… ఆ పగిలిన ముక్కలు ఇంట్లోని ఎవరో ఒకరి ఆత్మను లాగేసుకుంటాయని నమ్ముతారు. లేదా ఇంట్లో వారికి తీవ్ర అనారోగ్యాలు వస్తాయని భావిస్తారు. అవి ఏడేళ్లు ఉంటాయని నమ్ముతారు. మన సైడ్ అయితే.. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అంటారు.
ఆఫ్రికాలో పగిలిన వాటిని చూసుకోకుండా కాలితో తొక్కడాన్ని శాపంగా భావిస్తారు. అలా చేసిన వ్యక్తి ఇంట్లో ఎవరో ఒకరికి చెడు జరుగుతుందని నమ్ముతారు.
అమెరికాలో నాణేలు దొరకడాన్ని అదృష్టంగా భావిస్తారు. అయితే బొరుసుతో ఉన్న నాణెం కనిపిస్తే… దాన్ని బొమ్మవైపు తిప్పి వదిలేయాలన్నది మరికొందరి నమ్మకం. బొరుసుతో ఉన్నదాన్ని తీసుకుంటే… చెడు జరుగుతుందని వారు నమ్ముతారు.
గుర్రపు నాడా దొరికితే.. ఇంట్లోని చెడు శక్తులన్నీ పోతాయని యూరోపియన్లు నమ్ముతారు. ప్రాచీన రోమన్లు దీన్ని బాగా నమ్మేవారు.
నల్ల పిల్లులను చాలా దేశాల్లో చెడుగా భావిస్తారు. అవి సైతానుకు ప్రతిరూపంగా చెప్పుకుంటారు. నల్లపిల్లి ఎదురొస్తే జరగాల్సిన పని సరిగా జరగదంటుటారు. ఇండియాలో కూడా ఈ నమ్మకం ఉంది.
ఏ నెలలోనైనా 13వ తేదీన శుక్రవారం వస్తే… అది చెడుదినంగా యూరోపియన్లు నమ్ముతారు. ఆ రోజున చాలా మంది ఏ కొత్త పనులనూ పెట్టుకోరు.
కరీబియన్ దీవుల్లో ఎవరికైనా ఎడమ అరచేతిలో దురద వస్తే … ఇక వారి డబ్బు నీళ్లలా ఖర్చవుతుందని నమ్ముతారు. అదే కుడి అరచేతిలో దురద వస్తే.. వారికి ధనం బాగా లభిస్తుందని అనుకుంటారు.
టర్కీలో రాత్రివేళ చ్యూయింగ్‌గమ్ తినరు. అలా చేస్తే… శవాన్ని తిన్నట్లుగా భావిస్తారు.
చైనా ప్రజలకు 4 అంటే నచ్చదు. చైనా భాషలో నాలుగు అంటే మరణం అని అర్థమట. అందువల్ల 4వ తేదీన వారు కొత్త పనులేవీ స్టాట్ చేయరు.
గల్ఫ్ దేశాల్లో నజర్స్ అని పిలిచే చెడుకన్ను బొమ్మ వున్న ఆభరణాలు ధరిస్తారు. అది ధరిస్తే చెడు విధి రాతలు, భయంకరమైన శక్తులు తొలగిపోతాయని వారి నమ్మకం.
జపాన్‌లో శ్మశానంలోకి వెళ్లినవారు పిడికిలిలో బొటనవేలును దాచేస్తారు. ఇలా చేయడం వల్ల వారి తల్లిదండ్రులకు ఆత్మల వల్ల మరణం రాకుండా ఉంటుందని నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news