ఇంట్రావర్ట్: వీరితో మాట్లాడేటపుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసా?

-

ఎక్కువగా మాట్లాడని వారిని ఇంట్రావర్ట్ అంటారు. ఇంకా చెప్పాలంటే అవసరం ఉంటే తప్ప మాట్లాడని వారిని ఇంట్రావర్ట్ అంటారు. మీ సమూహంలో ఎవరో ఒకరు ఇలాంటి వారు ఉండే ఉంటారు. అందరి చర్యలని గమనిస్తూ, వారు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటారు. మాటలు తక్కువగా మాట్లాడతారని వారిని తక్కువ అంచనా వేస్తే తొక్క మీద కాలేసినట్టే. ఇంట్రావర్ట్ తో మాట్లాడేటపుడు ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంట్రావర్ట్

అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే వారికి పూర్తి సమాచారం గుర్తుంటుంది. చాలా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళ మెమరీలో భద్రంగా ఉంటాయి. అందుకే వారి ముందు అబద్ధం చెప్పాలని ప్రయత్నించవద్దు.

వారేదైనా సాధించాలని అనుకున్నప్పుడు వారి దృష్టి అంతా దానిమీదే ఉంచుతారు. రోజులు, వారాలు, నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తారు. అందుకే వారితో ఛాలెంజీలు చేయక్ండి.

వాళ్ళు తక్కువ మాట్లాడతారు అలా అని మాట్లాడడం చేత కాదని అనుకోవద్దు. ఒక విషయాన్ని వారు వివరించినంత బాగా మరెవరూ వివరించలేరు. ఆ విషయం ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా చక్కటి ఉదాహరణలతో చెప్తారు.

ఇంట్రావర్ట్ తో గొడవ పడాలనుకుని గెలవాలనుకోవడం కష్టం. ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా రకాలుగా విశ్లేషిస్తారు. ఎంతలా అంటే, మీ గురించి మీకే తెలియని కోణాల్లో వారి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మీ బలహీనతలు వారికి క్షుణ్ణంగా తెలుస్తాయి.

ఏదైనా మాటమీద నిలబడ్డారంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ మాటకి కట్టుబడి ఉంటారు. వారి వారి పరిస్థితులను కూడా మర్చిపోయి తామిచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు.

సలహాలు ఇవ్వడంలో వాళ్ళని మించిన ఎవరూ ఉండరు. అలా అని ఉచిత సలహాలు అస్సలు ఇవ్వరు. అడిగితే తప్ప సలహాలు ఇవ్వరు.

Read more RELATED
Recommended to you

Latest news