ఈ ఫొటో చూస్తే కండ్ల‌కు కనువిందే.. ప్ర‌కృతి అందం అంటే ఇదేనేమో..!

ఈ సృష్టిలో ప్ర‌కృతిని మించిన అందం మ‌రొక‌టి ఉండ‌దేమో అనిపిస్తుంది. ఎందుకంటే స‌హ‌జంగా ఉండే ప్ర‌కృతిలోనే ఎన్నో అందాలు దాగుంటాయి. వాటిని చూడ‌టానికి మ‌న రెండు కండ్లు కూడా స‌రిపోవేమో అనిపిస్తుంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ప్ర‌కృతి అందాలు అనేకం మ‌న‌కు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుంటాయి. ఆ అందాల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎంత‌గానో వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ ప్ర‌కృతి అందాల‌ను కూడా ఎక్కడపడితే అక్కడ చూడలేమ‌నే చెప్పాలి. ఇక నార్వే, ఐస్‌లాండ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత సుంద‌ర‌మైన ప్రాంతాలు ఉంటాయి. అక్క‌డ మంచు ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌కృతి అందాల‌కు కొద‌వే లుకుండా పోతోంది. ఈ ప్రాంతాల్లో నేలపై ప్ర‌తి వ‌స్తువు ప్రతిబింబం కూడా పడటంతో మరింత అందాన్ని సంతరించుకుంద‌నే చెప్పాలి.

ఇక ఈ సంవ‌త్స‌రం ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్ ది ఇయర్‌ తుది లిస్టుకు సెలెక్ట్ అయిన ఫొటోలో మ‌నం మాట్లాడుకోబోయే ఫొటో కూడా ఉంది. ఈ ఫొటోను ఐస్‌లాండ్‌లో లారిన్‌ రే అనే ఫేమ‌స్‌ ఫొటోగ్రాఫర్ క్లిక్ మ‌నిపించారు.  ఆకాశంలో ఏర్ప‌డ్డ ఆకారం ఫొటో అచ్చు గుద్దిన‌ట్టు భూమ్మీద ప‌డ‌టంతో సేమ్ టు సేమ్ అనేలాగే ఉంది. ఆ అందాల‌ను చూడ‌టానికి రెండు కండ్లు కూడా స‌రిపోవు. మ‌రి మీరు కూడా ఓ సారి చూసేయండి.