జియో నుంచి మరో సంచలన ప్లాన్‌.. రూ.98కే.. 1.5 జీబీ డేటా!

దిగ్గజ రిలయన్స్‌ జియో మరో సంచలన రీఛార్జ్‌ ప్లాన్‌తో ముందుకువచ్చింది. రూ. 100కే అనేక రీఛార్జ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. ఆకట్టుకుంటూంది.

తాజాగా రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం రూ. 98 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు. ప్రతిరోజూ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్‌ కూడా ఉంటుంది. జియో ఆప్‌ కూడా ఉపయోగించవచ్చు.

గత ఏడాదే, జియో రూ .98 ప్లాన్ ను నిలిపివేసింది. దీనికి బదులుగా ఇది రూ .129 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. మళ్లీ ఈ ప్లాన్‌ను ముందుకు తీసుకువచ్చారు. జియో ఫోన్‌ యూజర్లకు అతి తక్కువ ధరకు అంటే రూ .39, రూ .69 ప్లాన్ లు ఉన్నాయి. రెండు ప్లాన్ ల వ్యాలిడిటీ 14 రోజులు. కాగా, రూ .39 ప్లాన్‌ డైలీ 0.1జీబీ డేటాను అందిస్తుంది. రూ .69 ప్లాన్‌ 0.5 జీబీ రోజువారీ డేటా అందిస్తోంది.
తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్లు తీసుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాన్లు బెస్ట్‌ ఆప్షన్‌.