జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మరో ఏడాది పాటు ఉచితం..!

ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ… ఎప్పుడూ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండే జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లందరికీ మరో ఏడాది పాటు మెంబర్ షిప్ ను ఉచితంగా పొడిగించింది.

రిలయెన్స్ జియో.. వచ్చుడు వచ్చుడే సంచలనాలు సృష్టించింది. ఉచితంగా సిమ్, ఉచితంగా వాయిస్ కాల్స్, ఉచితంగా డేటాను ఇచ్చి ఇదివరకు ఉన్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. తో ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్ గా అవతరించింది. జియో దెబ్బకు మిగితా నెట్ వర్క్ లన్నీ కుయ్యోముర్రో అన్నాయి. ఇంకా అవి కోలుకోలేదు కూడా. జియో రావడానికి కంటే ముందు.. నెంబర్ వన్ నెట్ వర్క్ గా కొనసాగిన ఎయిర్ టెల్.. జియో ప్రవేశపెట్టే ఆఫర్స్ కు కుదేలయింది.

Jio prime membership extended to another year for jio users

ఇలా.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ… ఎప్పుడూ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండే జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లందరికీ మరో ఏడాది పాటు మెంబర్ షిప్ ను ఉచితంగా పొడిగించింది. గత సంవత్సరం కూడా జియో.. ప్రైమ్ మెంబర్ షిప్ ను ఉచితంగా పెంచింది. ఈసారి కూడా ఉచితంగానే మెంబర్ షిప్ ను పెంచింది జియో.

ఈ ఆఫర్ ను పొందడానికి ఇప్పటికే ప్రైమ్ మెంబర్ షిప్ ను కలిగి ఉండాలి. నిజానికి ప్రైమ్ మెంబర్ షిప్ కోసం 99 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. కానీ.. ఈసారి కూడా 99 రూపాయలతో రీచార్జ్ చేసుకోకున్నా.. ఆటోమెటిక్ గా అది రెనివల్ అవుతుంది.

దాని కోసం కస్టమర్లు మైజియో యాప్ లోని మై ప్లాన్స్ సెక్షన్ లోకి వెళ్లి జియో ప్రైమ్ మెంబర్ షిప్ పెరిగిందో లేదో తెలుసుకోవచ్చు. జియో కస్టమర్లందరికీ ఆటోమెటిక్ గా మెంబర్ షిప్ ను పొడిగిస్తుంది. పొడిగించాక యూజర్లకు మెసేజ్ కూడా వస్తుంది.

ప్రైమ్ మెంజర్ షిప్ కింద.. వచ్చే ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ లాంటి సేవలను ఉచితంగా పొందవచ్చు.