పిల్లలున్న తల్లిదండ్రులు తప్పకుండా చదవాల్సిందే…!!!

-

చిన్న పిల్లల అల్లరి కొన్ని సందర్బాలలో భలే ముద్దుగా ఉంటుంది, కొన్ని సందర్బాలలో కోపం తెప్పిస్తుంది. గత రోజుల్లో చిన్న పిల్లలు అమ్మ వెనకాలే తిరుగుతూ  చేస్తున్న ప్రతి పనిలోనూ పక్కనే ఉంటూ , ఆడుతూ ఉండేవారు ఎందుకంటే   ఆట,కాలక్షేపం,సరదా వారికి  అన్ని  అమ్మే. కానీ కాలం మారుతున్నకొద్దీ  ఆటల సరదా కూడా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఇక కొత్తగా చెప్పనక్కర్లేదు. పిల్లల వయసుతో కూడా సంబంధం లేకుండా తల్లులు  మొబైల్ ఫోన్స్ అలవాటు చేసేస్తున్నారు. దాంతో కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులుకి షాకుల మీద షాకుల ఇస్తున్నారు.

అమెరికాకు చెందిన వేరోనికా ఎస్తేల్ తన పిల్లల చేసిన పనికి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ బుడతలు వేరోనికా క్రెడిట్ కార్డును ఉపయోగించి  ఏకంగా Rs.47000 విలువగల  ఆన్ లైన్ షాపింగ్ అమెజాన్ లో చేశారు. ఇంటికి ఆర్డర్ డెలివర్ అయ్యాక కానీ ఆమె కు అసలు విషయం తెలియలేదు. వచ్చిన ఆర్డర్ ప్యాక్కింగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యింది. ఇన్ని టాయ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చి ఉంటారు అని ఆలోచనలో పడింది. దాంతో ఆమె దృష్టి పిల్లల వైపు పడింది.

మీరు ఏమన్నా బొమ్మలు ఆర్డర్ చేశారా అని అడగగానే అవును అంటూ సమాధానం చెప్పడంతో దిమ్మతిరిగిపోయిన ఆమె ఎలా చేశారు అనడంతో అసలు కథ చెప్పారు. మేము అలెక్సా ని అడిగాము ఇవన్ని చూపించింది, వెంటనే బుక్ చేయమని చెప్పాము అన్నారు. కళ్ళు తేలేసిన తల్లి పిల్లలకి ఈ వయసులో ఇలాంటివి దగ్గర చేయకూడదని గ్రహించింది. ఆమె కాదు ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏ వయసులో ఏమి ఇవ్వాలో, పిల్లలు హద్దులు దాటకుండా ఎలా చూసుకోవాలో తెలుసుకుంటే ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు..

Read more RELATED
Recommended to you

Latest news