కరోనాను భయపెట్టిన కిమ్… వీడు మామూలోడు కాదు గురూ…!

-

చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. చైనా సరిహద్దున ఉన్న ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా లేదు. చైనాలో కరోనా వైరస్ దెబ్బకు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాని ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా లేదు. ఉత్తర కొరియా చైనా సరిహద్దు 900 మైళ్ళ వరకు ఉంటుంది. అయినా సరే కరోనా మాత్రం ఉత్తర కొరియాకు వెళ్ళలేదు. చైనాలో భీకరంగా ఉన్నా సరే ఉత్తర కొరియా ను టచ్ చేయడానికి భయపడింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించకుండా నే ఆ దేశం జాగ్రత్తపడింది. ఏ దేశం తీసుకొని విధంగా నిర్ణయాలు తీసుకుంది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్. బాబు దెబ్బకు కరోనా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. కరోనా వస్తే సాధారణంగా వైద్యం చేస్తే బ్రతుకుతారు. కాని ఆ దేశంలో మాత్రం ఇలా ఉండదు. కరోనా చావు కంటే కరోనా వచ్చింది అని తెలిస్తే చావు చాలా దారుణంగా ఉంటుంది.

చైనాలో కరోనా వైరస్ విస్తరిస్తుంది అనుకున్న వెంటనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్… వెంటనే ఆంక్షలు జనవరి నుంచి అమలు చేయడం మొదలుపెట్టాడు. లాక్ డౌన్ విధించాడు.. జనాలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తే మాత్రం అల్ల కల్లోలమే. వైద్య సదుపాయాలు ఉండవూ.. ఆ దేశంలో ఉన్న ఆస్పత్రుల్లో కనీసం నీళ్ళు కూడా ఉండవు. కరెంట్ కి అయితే దిక్కు లేదు. కరోనా వస్తే బులెట్ తో వైద్యం చేస్తారు. అత్యవసరం ఉంటే ప్రజలు బయటకు రాకూడదు.

ఎప్పటి నుంచొ ప్రజలు అందరూ కూడా ఐసోలేషన్ లోనే ఉన్నారు. అధికార టీవీ ద్వారా కరోనాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇక విదేశీ టూరిస్ట్ లను కూడా కొరియాలో నిషేధం విధించారు. అక్కడ ఫోటోలు తీయకుండా ఆంక్షలు విధించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే… కిమ్ జాంగ్ కరోనాను భయపెట్టాడు. అక్కడ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు లేవు కాబట్టి ముందే జాగ్రత్త పడి బులెట్ రూపంలో న్యాయం చేసాడు. సరిహద్దులను మూసి వేస్తే నష్టం వచ్చినా సరే అతను వెనక్కు తగ్గలేదు.

ఉత్తర కొరియాలో మీడియాకు స్వేచ్చ లేదు. బాబు ఎం చెప్తే అది రాసుకోవడమే గాని సొంతగా రాస్తే అదే ఆఖరి అక్షరం. దీనితో అక్కడి ప్రభుత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కేసులు లేకుండా ఏ విధంగా ఉంటాయని అతను వచ్చిన వాళ్ళను చంపేసాడు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అతన్ని చూసి అమెరికా కూడా ఒకరకంగా షాక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news