ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక సమయంలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తుంది అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇది ఎంత వరకు నిజమో తెలియకపోయినా ఆయనకు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. అందుకే ఆయన జగన్ ని కలిసారని ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్ ని కీర్తించారు అనే ప్రచారం ఎకువగా సోషల్ మీడియాలో జరిగింది.
మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఆయనకు రాజ్యసభ సీటు రాలేదు. జగన్ వేరే వాళ్లకు రాజ్యసభ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కరోనా కారణంగా రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ రాజ్యసభ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారా అనేది స్పష్టత లేదు. అయితే చిరంజీవి ఇంకా రాజ్యసభ కోసమో లేక మరో పదవి కోసమో ట్రై చేస్తున్నారని, ఒక బిజెపి అభ్యర్ధిని తప్పించి తనకు రాజ్యసభ కావాలని,
అందుకోసం మోడీని కలవాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మోడీ ఇచ్చిన చప్పట్లు, దీపాల పిలుపుని మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ప్రచారం చేస్తూ చేసింది. చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరం తేజ్ ఇలా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో హడావుడి చేసారు. మోడీ కూడా ఆ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చిరంజీవి కుటుంబానికి ధన్యవాదాలు కూడా తెలిపారు.
దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మోడీ ని దగ్గర చేసుకోవడానికి గానూ మెగా ఫ్యామిలీ చాలా వరకు కష్టపడుతుంది అంటున్నారు. అందుకే ఈ విధంగా కరోనా వైరస్ ని వాడుకుని మోడీ ఇచ్చిన పిలుపు వెంటనే సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే మెగా ఫ్యామిలీ పదవి కోసం మోడికి గాలం వేస్తుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.