మ్యూఛువల్ ఫండ్స్: టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్.. వివరాలు..

-

మ్యూచువల్ ఫండ్లలో విభిన్నరకాలైన స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ, డెట్, లిక్విడ్, ఆర్బిట్రేజ్, హైబ్రిడ్ ఫండ్లతో పాటు టాక్స్ సేవింగ్స్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ టాక్స్ బెనిఫిట్ ఫండ్ల గురించి తెలుసుకుందాం. నిజానికి వీటిని ఈఎల్ ఎస్ ఎస్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ లింక్డ్ టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ అని దాని అర్థం. అంటే, ఈక్విటీతో లింక్ చేయబడి ఆదాయ పన్నును ఆదా చేసే ఫండ్స్ అన్నమాట. ఆదాయ పన్ను కట్టే ప్రతీ ఒక్కరూ ఈ స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే.

సెక్షన్ 80సీ కింద ఈ ఆదాయ పన్ను ఆదా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో టాక్స్ సేవింగ్స్ స్కీమ్ ఎంచుకున్నారనుకుందాం. దానిలో మీరు పెట్టే పెట్టుబడిపై మీ ఆదాయంలో టాక్స్ వర్తించదన్నమాట. అంటే, మీరు అందులో 50వేల రూపాయలు పెట్టారనుకుందాం. మీరు ఆదాయ పన్ను కట్టేటపుడు ఈ వివరాలు చూపించాల్సి ఉంటుంది. అపుడు మీ ఆదాయంలో 50వేల రూపాయలకి పన్ను వర్తించదు. అలా అని చెప్పి ఈ టాక్స్ సేవింగ్స్ స్కీముల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆ మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందనుకుంటే పొరపాటే.

సెబీ నియమాల ప్రకారం ఈక్విటీ లింక్డ్ టాక్స్ సేవింగ్స్ స్కీముల్లో 1,50,000రూపాయల వరకు మాత్రమే ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి ఎంత పెట్టుబడి పెట్టినా మీ ఆదాయంలో 1,50,000రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద ఇ మినహాయింపు వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఐతే ఇక్కడో విషయం గమనించాలి. టాక్స్ సేవింగ్స్ స్కీముల్లో పెట్టుబడిన పెట్టుబడులు లాకిన్ మోడ్ లో ఉంటాయి.

కొన్ని కొన్ని 3 సంవత్సరాలు కూడా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు ఈ విషయాలను చూసుకోవాలి.

గమనిక: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడూలు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news