కేటీఆర్.. ఆన్‌లైన్ హీరో

-

KTR online hero most tagged person in tweets in recent elections

కేటీఆర్.. ప్రస్తుతం ఆన్‌లైన్ హీరో అయ్యారు. ట్విట్టర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన మరో రికార్డు సృష్టించారు. కేటీఆర్ ట్విట్టర్‌లో ఎప్పుడూ చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలుసు. అయితే.. ఎన్నికల సమయంలో కూడా.. ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా కేటీఆర్ ట్విట్టర్‌లో అందరికీ అందుబాటులో ఉండడం.. తెలంగాణ ఎన్నికల ప్రచార ట్వీట్లను అత్యధికంగా చేసి రికార్డుకెక్కారు.  దీంతో ట్విట్టర్‌లో ఎన్నికలకు సంబంధించిన ట్వీట్లలో ఎక్కువగా కేటీఆర్ పేరునే ట్యాగ్ చేశారు చాలామంది. దీంతో ఆయన పేరుతో ట్యాగ్ చేసిన ట్వీట్లు ఎక్కువగా నమోదవడంతో ట్విట్టర్‌లో టాప్ రికార్డును దక్కించుకున్నారు.

మొన్న జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా దాదాపు 70 లక్షలకు పైగా ట్వీట్లు నమోదు అయ్యాయి. #IndiaElections2018 హ్యాష్‌టాగ్ పేరుతో ఈ ట్వీట్లన్నీ నమోదయ్యాయి. ఆ హ్యాష్‌టాగ్ పేరుతో.. కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ చాలామంది ట్వీట్ చేశారు. దీంతో ఆయన తొలిస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ లీడర్ లక్ష్మణ్ ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే… ట్విట్టర్‌లో ఎక్కువగా ట్యాగ్ చేసిన నాయకుడిలో ప్రధాని మోదీ మొదటి వ్యక్తి కాగా.. రెండో వ్యక్తి రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news