లేడీ ఫారెస్ట్‌ ఆఫీసర్.. ఆమె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. 400 విషసర్పాలను అవలీలగా పట్టేసుకుంది

-

బల్లిని, బొద్దింకను చూస్తేనే చాలా మంది ఆడవాళ్లు భయపడతారు. అవును మహిళలు కాస్త సెన్సిటీవే. కానీ అందరూ కాదు. ధైర్యానికి ప్రతీక కూడా ఆడవాళ్లే. విషసర్పాలను సైతం అవలీలగా తన ఆధీనంలోకి తెచ్చుకోగలదు ఆమె. ఒకప్పుడు జర్నలిస్ట్.. కానీ ఇప్పుడు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్. ఆరేళ్లలో కింగ్ కోబ్రా, బుసలు కొట్టే నాగుపాములు ఒకటి రెండు కాదు ..సుమారు 400 పాములను పట్టుకుంది. రోష్ని పారుతిపల్లి రేంజ్‌ కార్యాలయంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారిణి. పాములే కాదు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఈ డైనమిక్ లేడీ ముళ్ల పంది, అడవి పంది, కోతి, జింక, వడ్రంగిపిట్ట వంటి జీవులు. వెండి గుడ్లగూబ, నెమలి, చిలుకతో సహా ఎన్నో పక్షులను కాపాడుతూ ..వాటిని సంరక్షించింది.

రోష్ని జర్నలిస్ట్. దూరదర్శన్, ఆకాశవాణిలో పాత్రికేయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే తన కలను సాకారం చేసుకునేందుకు కష్టపడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని రోష్ని కోరుకోలేదు. అయినా ప్రభుత్వం ఉద్యోగం కావడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఇష్టంతోనే ఉద్యోగంలో చేరింది. యుక్త వయస్సులోనే జాబ్ రావడంతో ఈ డేరింగ్ విమెన్ దేనికి భయపడలేదు. అడవిలో జంతువులు, వన్యప్రాణులు, క్రూరమృగాల మధ్య పని చేయాల్సి వస్తోందని మానసికంగా సిద్దపడి అందులోనే మంచి పేరు తెచ్చుకుంటోంది.

అడవిలో ఉండే ఉద్యోగం కావడంతో అక్కడి జంతువులు, విషసర్పాలతో రోష్నికి స్నేహం కుదిరింది. మహిళా అటవీ బీట్ ఆఫీసర్ల తొలి బ్యాచ్‌లో రోష్ని ఎంపికైంది. ఎంత పెద్ద పాములు, విషసర్పాలను చూసిన భయపడకుండా ధైర్యంగా వాటిని పట్టుకోవడం నేర్చుకుంది. ఇలాంటి వృత్తిని ఎంచుకొని ధైర్యంగా చేస్తుండటంతో తన సహాయం కోరుతూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా కాల్స్ చేస్తున్నారంటోంది రోష్ని. చేసే పనిని ఇష్టపడితే అందరూ చేయగలరన్నది రోష్ని అభిప్రాయం.

గతంలో ఈ రంగంలో ఉద్యోగాల కోసం అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండేది. కాని తనను స్పూర్తిగా తీసుకొని ఎక్కువ మంది అమ్మాయిలు ఉపాధి కోసం వెతుకుతున్నందుకు సంతోషంగా ఉందని రోష్ని చెప్తోంది. కొన్నిసార్లు ఉద్యోగంలో భాగంగా అర్థరాత్రి కూడా వెళ్లిపోవాల్సి వస్తుంది. కుటుంబ సపోర్ట్ ఉండటం వల్లే ఇదంతా చేయగలుగుతున్నట్లు రోష్ని తెలిపింది. మహిళలు ఈ విధంగా ధైర్యంగా ఉండటం చూస్తే చాలా ముచ్చేటేస్తుంది. అందరూ ఇలానే ఉండాలి అసలు. అప్పుడే మనకు మనమే ఒక దిశ అవుతాం. ఆపద సమయంలో ఎవరో వచ్చి కాపడతారు అని కాకుండా ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news