కరోనా తగ్గిపోయిన దాని ఇబ్బందులు తగ్గట్లేదా? నిపుణులు సూచిస్తున్న టిప్స్ పాటించండి.

కరోనా (Corona Virus) నుండి రికవరీ అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు బాధపెడుతున్నాయి. వృద్ధుల్లో ఈ ఇబ్బందులు అధికంగా కనబడుతున్నాయి. అందుకే కరోనా నుండి రికవరీ అయ్యాక కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది. కరోనా సోకిన మొదటి వారంలో ఐదు లక్షణాల కంటే ఎక్కువ ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిపుణుల సమాచారం.

రికవరీ అయ్యాక వచ్చే ఇబ్బందులు అంటువ్యాధుల్లాగా ఇతరులకి సోకవు. కరోనా సోకినపుడు అది శరీరం మీద చూపిన ప్రభావం కారణంగా కరోనా తగ్గిన తర్వాత ఇబ్బందులు వస్తుంటాయి. దీనివల్ల గుండెదడ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కరోనా తగ్గాక కూడా ఆరోగ్యం మీద జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఇబ్బందులని దూరం చేసుకోవడానికి ఏం చేయాలంటే,

ప్లాన్ చేసుకోండి.. రోజు వారి పనులని ప్లాన్ చేసుకున్న విధంగానే చేయండి. అంతకుమించి ఎక్కువ చేయవద్దు.

కష్టంగా అనిపించే పనులని చిన్న చిన్న వాటిగా డివైడ్ చేసుకుని చేయడం మొదలెట్టండి. ఒకేసారి పూర్తి పని చేయవద్దు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది.

చిన్న చిన్న విరామాలు తీసుకోండి. పెద్ద విరామాల కంటే చిన్న విరామాలు శరీరానికి మేలు చేస్తాయి.

వ్యాయామాలు చేయండి. కానీ మెల్లమెల్లగా మొదలెట్టండి. ఒకేసారి అధిక వ్యాయామాలు చేయవద్దు.

మీరు వృద్ధులై కర్రసాయంతో నడుస్తుంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినపుడు కర్రమీద బలం వేసి ముందుకు వంగాలి.

మీకు సంతోషం కలిగించే పనులు చేయండి. బంధువులతో మాట్లాడడం, ఫ్రెండ్స్ మొదలగు వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి.

చురుగ్గా ఉండండి. దానివల్ల ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అవి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.