నాపై చిన్న చూపు.. జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన

-

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య పీసీసీ చిచ్చు రేగిన విషయం తెలిసిందే. ప్రధానంగా పీసీసీ పదవి కోసం సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పీసీసీ రేసుపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను పీసీసీ అడుగుతున్నా ఢిల్లీ చర్చలో లేననని అసహనం వ్యక్తం చేశారు. అది తన దురదృషమని వాపోయారు. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ తనను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బలమైన నాయకుడిగా తనను  గుర్తించడంలేదన్నారు.

‘‘ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్‌ను అడ్డగించిన చరిత్ర నాది. ఇది ఠాగూర్‌కు తెలువక పోవడం నా దురదృష్టం. రాజకీయంగా కేసీఆర్‌ను అడ్డుకోవడం నాతోనే సాధ్యం. కేసీఆర్‌ ను గద్దె దింపే మెడిసిన్ నా దగ్గర ఉంది. నేను చెబుతున్నది కామెడీ కాదు సీరియస్. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త గా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. వి.హెచ్‌ను కొందరు బెదిరించడాన్ని ఖండిస్తున్నా. బెదిరించేవారు ఫోన్ నెంబర్ పెట్టండి నేను వచ్చి మాట్లాడతా. ఫేస్ బుక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటుంది.’’అని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news