అది ధోనీ స్టామీనా.. ధోనీ క్యాచ్ చూస్తే మీ మతిపోతుంది..!

-

అది ధోనీ స్టామీనా అంటే. అది ధోనీ సత్తా అంటే. ధోనీ అంటే ఏమనుకున్నాడు. ఆయనలో మునుపటి ఫామ్ లేదని అనుకుంటున్నారా? చూశారుగా ఇప్పుడు. ఆ క్యాచ్ చూశారుగా. ఇప్పుడేమంటారు సెలెక్టర్స్. మీరు టీ20 నుంచి ధోనీని ఎందుకు తీసేశారో పక్కన బెట్టేద్దాం కానీ.. ఈ క్యాచ్ చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోతాయి. ధోనీ.. 37 ఏళ్ల వయసులోనూ ఏంది ఆ స్టామీనా. నీలో ఏమాత్రం క్రికెట్‌పై ఉన్న ఆసక్తి తగ్గలేదు. ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి.

ఇవాళ పూణెలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో బుమ్రా బౌలింగ్‌లో హేమ్‌రాజ్ కొట్టిన బంతిని ఎంతో రిస్క్ తీసుకొని ఓ అథ్లెట్‌లా వేగంగా పరిగెత్తి బాల్ పట్టుకున్న తీరు చూసి క్రికెట్ అభిమానులంతా తెగ సంబర పడిపోతున్నారు. ధోనీ ధోనీయే. ఆయన్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news