దాదాపు ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప.. బరువు 270 కిలోలు.. మార్కెట్‌లో ధర రూ. 23 కోట్ల పైమాటే. ఇలాంటి ఖరీదైన చేపను ఐర్లాండ్ తీరంలో డేవ్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తి పట్టుకున్నాడు. క్యాచ్ అండ్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనే 15 బోట్లలో డేవ్ ఒకరు. అయితే అంత ఖరీదైన చేప పట్టి చివరకు మళ్లీ నీళ్లలో వదిలేయడం ఆశ్చర్యం.
అయితే దీనిపై డేవ్.. తాము సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం ఉద్దేశం కాదని చెప్పాడు. వారు ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి వదిలేస్తున్నామని తెలిపాడు. ఈ భారీ ట్యూనా చేపల చిత్రాలను వారు తమ ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు.