గుమ్మడి భక్షాలు తయారీ విధానం

-

కావాల్సినవి :
గుమ్మడికాయ తురుము : ఒక కప్పు
నెయ్యి : 1 1/2 టేబుల్‌స్పూన్స్‌
రవ్వ : అర కప్పు
చక్కెర : ఒక కప్పు
యాలకుల పొడి : పావు టీస్పూన్‌
మైదా : ఒక కప్పు
మైదా పిండి : అర కప్పు
ఉప్పు : చిటికెడు
నూనె : 2 టేబుల్‌స్పూన్స్‌

తయారీ :
కడాయిలో నెయ్యి వేసి రవ్వను గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించాలి. ఇందులో గుమ్మడికాయ తురుము వేసి ఐదు నిమిషాల పాటు కలుపాలి. ఇందులోనే యాలకుల పొడి, చక్కెర వేసి మరో నాలుగు నిమిషాలు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు పోసి చపాతీ పిండి కంటే కాస్త వదులుగా కలుపుకోవాలి. కాసేపు దీన్ని పక్కన పెట్టాలి. పిండిని చిన్న ఉండలు చేసి పాలిథిన్‌ షీట్‌మీద చేతులతో పూరీ సైజులో ఒత్తాలి. దీంట్లో ముందు చేసిన గుమ్మడి ఉండలను పెట్టి మూసేయాలి. చేతికి కాస్త నూనె రాసుకొని వీటిని పూరీల్లాగా చేతితోనే ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news