ఈ రాశుల వారికి 2022లో వివాహం పక్కా.. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..?

-

ఎలాగొలా కొత్తసంవత్సరంలోకి అడుగపెట్టాం..అయితే పరిస్థితులు ఎలా ఉన్నాసరే..జీవితంలో కొన్ని ఏ టైంకి జరగాలో ఆ టైంకి జరగాల్సిందే..గత సంవత్సరం పెళ్లికి ప్రయత్నాలు చేసి..ఏవో కారణాల వల్ల అవి ముందుకుసాగక ఆగిపోయి ఉండొచ్చు. 2022 పెళ్లి వయసుకు వచ్చిన కొన్ని రాశుల వారికి ఈ ఏడాది పెళ్లి కావటం కాయం అట. మరి ఆ రాశులు ఏంటో అందులో మీరు ఉన్నారో లేరో చూసుకోండి..! అయిత కొంతమంది ఈ రాశులు , జాతకాలు అంటే పెద్దగా నమ్మరు. కానీ ఇలాంటి వాటికి గురించి తెలుసుకోటం కూడా ఆసక్తిగానే ఉంటుంది కదా..చూద్దాం ఇంతకీ ఆ రాశులేంటో..

వృషభం

ఈ రాశివారు..జరగాల్సింది టైం వచ్చినప్పుడు జరిగింది..అప్పటివరకూ మనం వేచి ఉండాల్సిందే అనుకునే టైప్‌ కాదు.. స్థిరమైన అనుబంధం కోరుకోవడం మంచిదే కానీ దాన్ని సాధించాలంటే ముందు ఆ అనుబంధానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాశివారికి..గత సంవత్సరం నుంచే అనుబంధల్లో ఉన్నప్పటికీ కొందరూ.. చెప్తే ఏమైపోతుందో అన్న భయంతో అడుగు ముందుకు వేయలేదు. ఈ ఏడైది ఆ భయాన్ని వదిలిపెట్టి ఎవరితో అయితే కలవాలనుకుంటున్నారో వారితో మీ మనసులో మాట చెప్పేయండి.

మిధునం

ఒంటరిగా ఉంటున్న మిధునరాశి వారు 2022 మధ్య లోపు తమ జీవితంలో ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారట. మరి వాళ్లతో కలవాలంటే..మీరు అద్భుతమైన సంభాషణ నైపుణ్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశికి చెందిన సింగిల్స్‌ ఈ ఏడాది మీకు నచ్చిన వారితో కలిపోతారు. అయితే వీరికి ఓ సమస్య ఉంది..ఇద్దరి మధ్య భావోద్వేగపరమైన సహకారం ఉండదు కాబట్టి అనుబంధం వికసించదు. అందువల్ల ఈ రాశివారు ఎదుటి వారిని పరస్పరం బాగా అర్థం చేసుకోవాలి, తగిన సమయం కేటాయించాల్సి ఉంటుంది.

మేషం

సాధారణంగానే.. మేష రాశి వారు ఏదైనా పని చేయడంలో తపన బాగా చూపుతారు. కానీ వీరికి అనుబంధాల విషయంలో అధిక తపన కొన్నిసార్లు హానికరంగా మారుతుంది. సంబంధాల విషయంలో మేష రాశి వారికి ఇది నిజంగా కఠిన పరీక్షే. అంటే పెళ్లి అవంటలో కాస్త కష్టపడాల్సిందే వీళ్లు. కానీ 2022 వారిలో మార్పు తీసుకువస్తుంది. వారి జీవితంలోనూ ప్రేమ మధురిమలు మొదలుకానున్నాయి.

సింహం

పేరుకు తగ్గట్టే ఈ రాశివారి మనస్తత్వం కింగ్‌లానే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఈ రాశివారికి మధురిమతో ఉండదు. సింహ రాశి వారు తమ ప్రేమికులను కనుగొంటారు కానీ, దాని కోసం చాలా సమస్యలే ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు సంబంధంలో ఉండటం ఇష్టం లేదు అనుకుంటే ఒంటరిగా ఉండటమే ఈ రాశివారికి శ్రేయస్కరం.

కన్య

కన్య రాశివారు ఈ సంవత్సరం.. తమకు నచ్చిన ఆ ప్రత్యేకమైన వ్యక్తిని సులభంగానే కలుసుకుంటారు. కానీ ఆ తర్వాత తలెత్తే సమస్యలు ఎదుర్కొనేందుకు మీరు అయితే సిద్ధంగా ఉండాలి. జీవితం పట్ల మామూలు ధోరణి మీకు వచ్చే భాగస్వామికి నచ్చకపోవచ్చు.

తుల

తగిన భాగస్వామిని కనుగొనేందుకు తులారాశి వారు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. భావోద్వేగపరంగా, లక్ష్యానికి అనుగుణమైన, కెరీర్‌కు అనుకూలంగా ఉండే వారి కోసం వారు అన్వేషించాల్సి ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశికి చెందిన వారు కొంత మంది ఇప్పటికీ అవివాహితులుగా ఉన్నట్లైతే.., వారికి ఈ ఏడాది పెళ్లి భాజా మోగుతుంది. చక్కని అభిరుచి, ప్రణయం కలిగిన వ్యక్తితో వారు త్వరలోనే ఒక మంచి సంబంధాన్ని ఏర్పరుచుకుంటారట.

కుంభం

ఈ రాశికి చెందిన చాలా మంది తమ ఒంటరితనానికి 2022 సంవత్సరంలో ముగింపు పలుకుతారు. ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. కెరీర్‌ పరంగా రిస్క్‌ చేసుకునేందుకు మీరు అస్సలు జంకొద్దు.

ధనుస్సు

ధనస్సు వారు రాశి జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, ముఖ్యంగా సంబంధంలో లేనప్పుడు వీరు చాలా కేర్‌లెస్‌గా ఉంటారట.. 2022లో తగిన భాగస్వామి వారి గుండె తలుపు తట్టేఅవకాశం ఉంది. కానీ సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉండటమన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది

మకరం

2021 సంవత్సరం ఒంటరిగా గడిపిన మకర రాశి వారికి ఈ సంవత్సరం కూడా దాదాపు అదే పరిస్థితి ఉంటుందట.. ఉద్యోగం, వ్యాపారానికి ఈ రాశివారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. దాని తర్వాతే రిలేషన్‌షిప్‌ అనుకుంటారు.

మీనం

కెరీర్‌తో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్యలతో మీన రాశివారు ఈ సంవత్సరం ఇబ్బందిపడతారు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి త్వరలోనే ప్రవేశిస్తారట.

మొత్తంగా చూసుకుంటే..మకర రాశి తప్ప మిగిలిన రాశుల వారికి ఈ ఏడాది పెళ్లి గడియలు ఉన్నట్లే ఉంది.

గమనిక: ఈ కథనం జ్యోతిష్య శాస్ర్త నిపుణులు చెప్పినవాటి ఆధారంగానే మీకు అందించటం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం వీక్షకులు ఆసక్తి, అవగాహన కోసమే వ్రాయబడిందని గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news