కంపెనీ లోగో పెద్దగా కనిపించే షర్ట్ ధరించే మగవారు.. బంధాలపై ఆసక్తి చూపించరు.. తాజా అధ్యయనం.

షర్ట్ లోగో బంధానికి కనెక్షన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, మీరు విన్నది నిజమే. తాజా అధ్యయనం ప్రకరం కంపెనీ లోగో పెద్దగా కనిపించ్ షర్ట్ వేసుకునేవారు బంధాలకి పెద్దగా విలువ ఇవ్వరట. ఈ మేరకు ఈ వార్త, పర్సనాలిటీ అండ్ సైకాలజీ సొసైటీ బులెటిన్ ప్రచురితమైంది. ఖరీదైన బట్టలు, వస్తువులు బహిర్గత పరచడం వారి వారి బంధాల మీద ఏదైనా ప్రభావం చూపుతుందా అన్న విషయం మీద పరిశోధన చేసిన ఈ బృందం కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడి చేసింది.

దీని ప్రకారం పెద్దగా కనిపించే లోగోలు ఉన్న షర్ట్ ధరించే వారు పెళ్ళి వంటి కమిటెడ్ రిలేషన్స్ లో ఉండాలని అనుకోరు. ఇలాంటి బంధాలపై పెద్దగా ఆసక్తి ఉండదట. వంద మంది మిచిగాన్ విద్యార్థుల ముందు రెండు రకాల షర్టులు పెట్టి( ఒకటి పెద్దగా కనిపించే లోగో, మరోటి చిన్నగా కనిపించే లోగో) ఎవరు ఏది సెలెక్ట్ చేసుకుంటారని అడగ్గా, వారి సమాధానాలకు 1నుండి 100వరకు పాయింట్లు ఇచ్చింది. దీని ప్రకారం పెద్దగా కనిపించే లోగో ఉన్న షర్టుని ధరించే వారు కట్టిపడేసే బంధాలను కోరుకోవడం లేదు.

అంటే దీనర్థం అలాంటి వారందరూ అవతలి వారిని మోసం చేసే వారుంటారని అర్థం కాదు. వారికి పెళ్ళి వంటి మొదలైన విషయాల్లో ఎక్కువగా ఆసక్తి లేదు. కానీ ఒకేసారి ఒక్కరితో కాకుండా ఇద్దరు ముగ్గురితో రిలేషన్ షిప్ లో ఉంటారని తెలిపింది. అలాగే చిన్న లోగో ఉన్న షర్టుని ధరించేవారు బంధంలో గాఢతని కోరుకుంటారని వెల్లడి చేసింది. అత్యంత ఖరీదైన వస్తువుల వాడకం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొందరు అవతలి వారికి తామెంత గొప్పో చెప్పాలని అనుకుంటారు. మరికొందరు అందరూ వేసుకుంటున్నారు కదా నాకేం తక్కువ అన్న కారణంగానూ ఖరీదైన వస్తువులు కొంటుంటారు.