ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ప్రతి భారతీయుడి విజయం ఇది. పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పాలని గత 12 రోజులుగా ఎదురు చూస్తున్న ప్రతి భారత పౌరుడు ప్రస్తుతం కాలరెగరేసుకొని తిరిగే సందర్భం. సర్జికల్ స్ట్రయిక్స్ 2.0 లో ప్రముఖ పాత్ర పోషించింది మిరాజ్ యుద్ధ విమానాలని తెలుసు. అయితే.. ఈ దాడుల కోసం ఈ విమానాలనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? అసలు.. మిరాజ్ చరిత్ర ఏంటి? కాస్త విఫులంగా తెలుసుకుందాం పదండి..
మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు ఎంత సామర్థ్యం ఉంటుందంటే అణ్వాయుధాలను కూడా అవి జార విడచగలవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎక్కువ సామర్థ్యం ఉన్నది వీటికే. అందుకే.. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి కోసం వీటిని ఎంచుకున్నారు. అంతే కాదు.. ఈ విమానాలను రాడార్లు గుర్తించలేవు. దీంతో శత్రువులకు తమ మీద దాడి చేయడానికి వస్తున్న విషయం తెలియదు. అందుకే.. మెరుపు దాడుల కోసం మిరాజ్ ను ఎంచుకున్నారు.
ఈ యుద్ధ విమానాలకు చాలా చరిత్ర ఉంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ మిరాజ్ 2000 యుద్ధ విమానాల పాత్ర ప్రముఖమైనది. అప్పుడు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు శత్రు స్థావరాలను చిత్తు చిత్తు చేశాయి.
ఈ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన కంపెనీ డసో తయారు చేస్తుంది. 1985 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వీటిని ఉపయోగిస్తున్నారు. వీటినే వజ్ర అని కూడా పిలుస్తుంటారు.
మిగితా యుద్ధ విమానాలతో పోల్చితే ఈ విమానాల బరువు చాలా తక్కువగా ఉంటుంది. వీటి బరువు కేవలం 7500 కిలోలు ఉంటుంది. ఇవి 9.5 టన్నుల బరువు ఉన్న వస్తువును తనతో తీసుకెళ్లి నిర్ధేశిత లక్ష్యాల్లో జార విడుస్తుంది. అంతే కాదు.. ఇవి వేగంలోనూ చాలా ఫాస్ట్. గంటకు 2336 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు మిరాజ్. భూమికి 17 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ విమానాలు ఎగరగలవు. పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వసం చేయడానికి మిరాజ్ యుద్ధ విమానాలు తీసుకున్న సమయం కేవలం 25 నిమిషాలు.. అంతే.