ఇరవైల్లో చేసే ఏ పొరపాట్లు జీవితంలో అడ్డంకులుగా మారతాయో తెలుసుకోండి.

-

కాలం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటుంది. ఎవ్వరి కోసమూ వెనక్కి రాదు. ఏది జరగాల్సిన సమయంలో అది జరిగితే మంచిది. కానీ అలా జరగనీయకుండా కొన్ని విషయాలు ఆపేస్తాయి. దానివల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోవడం దానివల్లే జరిగిందని తెలిసినా కూడా అప్పటికీ సమయం అంటూ ఉండదు. ఇరవైల్లో చేసే తప్పులు ముందు ముందు జీవితంలో అడ్డంకులుగా ఎలా మారతాయో తెలుసుకోండి. ఇప్పటికీ మీరింకా అదే పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి.

వ్యసనం

ఏ వ్యసనమైనా ఇరవైల్లోనే మొదలవుతుంది. అప్పటి వరకు జీవితమంతా కొత్తగా ఉంటుంది. అదే టైమ్ లో కొత్త కొత్త అలవాట్లు తయారవుతాయి. అప్పుడు అవి అలవాట్లుగానే ఉంటాయి. కానీ, రాను రాను అవి లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. అదెప్పుడు వ్యసనంగా మారిందన్న విషయం కూడా గుర్తుండదు. మీరు చేయాలనుకున్న ఎన్నో విషయాలను ఆ వ్యసనం అడ్డుకుందన్న విషయం కూడా మీకు తెలియదు.

అనుకరణ

ఇరవైల్లో ఎదుటివారిని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీలో సృజనాత్మకత తగ్గిపోతుంది. ఎదగనీయకుండా అక్కడే ఆగిపోయేలా చేస్తుంది. ఇప్పటికీ అనుకరించడంలోనే ఉన్నారేమో ఒక్కసారి చూసుకోండి.

స్వీయ నియంత్రణ లేకపోవడం

ఇరవైల్లో రక్తం ఉరకలు వేస్తుంది. ఎదురెవరు లేరన్న భావం పెరుగుతుంది. దానివల్ల తప్పులు చేస్తారు. ఒక్కోసారి ఆ తప్పులు ఎప్పటికీ దిద్దుకోలేనివిగా ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడు గుర్తొచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

నమ్మకం లేకపోవడం

ఇరవైల్లో జీవితం పూర్తిగా పరిచయం కాదు. అంతా కొత్తగా ఉంటుంది. ఏదైనా చేయాలంటే నమ్మకం ఉండదు. కానీ అది మంచిది కాదు. జీవితంలో విజయాలు, వైఫల్యాలు చాలా సాధారణం. అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news