ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు జీతంలో కోత‌..!

-

ఎవ‌రైనా ఉద్యోగులు వేతనం పెరుగ‌ద‌ల‌ను కోరుకుంటారు.. కాని త‌రుగుద‌ల‌ను మాత్రం కోరుకోరు.. అయితే ఇక్క‌డ కేంద్ర‌ప్ర‌భుత్వం మాత్రం ఇక్క‌డ ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల వేత‌నాల్లో భారీ కోత కోసి ఉద్యోగుల పొట్ట‌గొట్టింది. ఇది ఎక్క‌డో కాదు.. మ‌న ఇస్రోలోని సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త‌ల వేతనాల్లోంచి కోత ప‌డింది. దీంతో ఇదేమి మాయో ఏమో గాని ఇస్రో శాస్త్ర‌వేత‌లు ఇప్ప‌డు బోరుమంటున్నారు.

చంద్రయాన్ 2 ప్రయోగంతో దేశం మాత్రమే కాకుండా ప్రపంచమంతా మనవైపు ఆసక్తిగా చూసేలా చేసారు ఇస్రో శాస్త్రవేత్తలు. , కానీ చంద్రయాన్ 2 విఫలం అవ్వడంతో అంత ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలిచారు. ప్రధాని మోదీ కూడా సైన్స్ లో ప్రయోగాలు మాత్రమే ఉంటాయని వైఫల్యాలు ఉండవని ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతు తెలిపారు. అయితే కేంద్రం మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్ ఇచ్చింది.

ఇస్రోలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ కు , శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధించింది. అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జీతంలో కోత పడుతోంది.దీని ప్రభావంతో 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గనున్నాయి.దీనికి సంబంధించిన ఉత్తర్వులు జూన్‌ 12న విడుదల చేయగా, జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో స్పేస్ ఇంజనీర్స్ అసోసియేష‌న్  (ఎస్ ఈ ఏ) తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేయ‌గా, వేత‌నాల కోత ఆలోచ‌న విర‌మించుకునేలా కేంద్రంతో మాట్లాడి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇస్రో చైర్మ‌న్ కె.శివ‌న్‌ను శాస్త్ర‌వేత్త‌లు కోరారు.

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లకు మ‌ద్ద‌తు నిలిచిన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇప్పుడు ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డం ఏంట‌ని యావ‌త్ భార‌తావ‌ని ప్ర‌శ్నిస్తుంది. ఇలా చేస్తే ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల మ‌నోస్థ‌యిర్యం దెబ్బ‌తిన‌దా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఇలా పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news