స్కూల్‌ బస్సు కాదు.. బస్సే స్కూలు.. ప్రత్యేకంగా వారి కోసమే..!!

-

స్కూల్‌ బస్సు: స్కూల్‌కు వెళ్లడానికి బస్సు ఎక్కుతాం.. కానీ స్కూలే బస్సు అయితే.. ఆ బస్సు చదువుకోవాలనుకునే వాళ్లకు, విద్యకు దూరంగా నివసిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి మరీ చదువు చెబుతుంది. అదే బస్‌ స్కూల్‌.. మురికివాడలు, ఫుట్‌పాత్‌లలో నివసించే పేద పిల్లలకు ఆ బస్కులో ఉచితంగా చదువు చెప్తారు. గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌(Surat)లో ఈ బస్‌ స్కూల్‌ని ప్రారంభించారు. బస్‌నే మొబైల్ క్లాస్‌రూమ్‌గా మార్చారు. అందులోనే స్టూడెంట్స్‌కి బెంచీలు, కార్పెట్‌లు, టెలివిజన్, లైట్లు, ఫ్యాన్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి.

 

సూరత్‌లోని విద్యాకుంజ్-విద్యాపీఠ్ గ్రూప్ సంస్థ వారి ఉన్నతమైన ఆలోచనలో భాగంగానే మొబైల్ స్కూల్‌ అందుబాటులోకి వచ్చింది. చదువు చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ సంస్థ… తరగతులు ప్రతిరోజూ జరుగుతాయి. ప్రతి సెషన్ మూడు గంటల పాటు ఉంటుంది. ఫుట్‌పాత్‌లపై నివసించే వారి పిల్లలకు కూడా విద్య చాలా అవసరమని తాము నమ్ముతున్నామని అందుకే మొబైల్‌ స్కూల్ ద్వారా ఈ విధంగా చదువు చెబుతున్నామని విద్యాకుంజ్-విద్యాపీఠ్ గ్రూప్‌కి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. సవాలుతో కూడిన పరిస్థితులలో నివసించే పిల్లలకు మాత్రమే ఈ మొబైల్ స్కూల్‌లో విద్య చెప్పడం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఈ విధంగా తమ ద్వారా ఒక ముప్పై మందికి చదువు నేర్పిస్తే వాళ్లే మరికొందరికి విద్యాదానం చేసే పరిస్థితికి చేరుకుంటారని విద్యాకుంజ్-విద్యాపీఠ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పేద పిల్లలకు మెరుగైన జీవితం అందించాలనే తపనతోనే తాము ఈ మొబైల్ స్కూల్ బస్సులో సాధ్యమయ్యే ప్రతి సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు.. నిజంగా ఇది గొప్ప ఆలోచనే కదా..!

సంపూర్ణ విద్యే లక్ష్యం..

మొబైల్ క్లాస్‌రూమ్ అనుకూలమైన అక్షరాభ్యాస వాతావరణాన్ని అందించడమే కాకుండా పిల్లలకు ఆధునిక బోధనా ఉపకరణాలకు ప్రాప్యతను కలిగి ఉండేలా చేస్తుంది. బోర్డులో టెలివిజన్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో, విద్యార్థులు ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌తో పాల్గొనవచ్చు. చదువుకునే వయసులో చదువు విలువ చాలా మందికి తెలియదు.. అది తెలిసే వయసు వచ్చే సరికి.. చదువుకే టైమ్‌ ఉండదు..! అన్ని దానాలలో కంటే.. అన్నదానం గొప్పది అంటారు.. అన్నదానం కంటే గొప్పది విద్యాదానం.. ఈరోజు నువ్వు చెప్పిన చదువు రేపటి వారి భవిష్యత్తుకు పునాది అవుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news