ఆ దేశంలో లావుగా ఉండటం నిషేధం.. మీమ్స్‌ షేర్‌ చేయడం విరుద్ధం..!!

-

ఆ దేశంలో: ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో ఆచారం, సంప్రదాయం. కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు ఉంటాయి..మరికొన్ని దేశాల్లో చాలా భయంకరమైన రూల్స్ పెడతారు.. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నో చాలా వాటిపై నిషేధాజ్ఞనలు ఉన్నాయి.. కానీ మీరు లావుగా ఉండటం నిషేధం, ఫ్లిప్‌ ఫ్లాప్‌ పాదరక్షల్ని వేసుకోవడం నిషేధం ఇలా ఇలాంటి కొన్ని వింత నిషేధాలు ఉన్నాయి.. అవి ఎక్కడో, ఎందుకో చూద్దామా..!

ఇటలీ పశ్చిమ తీరంలోని కాప్రి దీవి ఓ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. మీరు దాన్ని సందర్శించాలని అనుకుంటే… మీరు అక్కడ ఫ్లిప్ ఫ్లాప్ పాదరక్షల్ని వేసుకోకూడదు. ఈ రకమైన చెప్పులను అక్కడ నిషేధించారు. ఇలాంటి చెప్పులను వేసుకున్నాక.. కిర్రుమని శబ్దం చేస్తాయి. ఈ శబ్దం ఇతర పర్యాటకులకు చిరాకు తెప్పించగలదు. అందుకే ఆ దీవిలో ఇవి నిషేధించారట.

 

ఫ్రాన్స్‌లో స్కూళ్లలో.. రుచిని పెంచే ఫ్లేవర్ ఎన్‌హాన్సర్లపై నిషేధం విధించింది. వీటిలో ఉప్పు, పంచదార, కెచప్, మయొన్నైస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా వాడితే పిల్లలు లావైపోతారు. అలా జరగకుండా ఫ్రాన్స్ నిషేధం విధించిందట.

గ్రీస్‌లో మహిళలు హైహీల్స్ వాడటంపై నిషేధం ఉంది. అయితే ఇది కొన్ని చోట్ల మాత్రమే. మహిళలు హైహీల్స్ ధరించి చారిత్రక ప్రాంతాలకు వెళ్లలేరు. హైహీల్స్… నేలపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. అవి చారిత్రక భవనాల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

జపాన్‌లో ఊబకాయంపై నిషేధం ఉంది. అయితే పూర్తిస్థాయిలో కాదు. అంటే.. కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న 40 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ నడుమును తరచూ కొలిపించుకోవాలి. ఉద్యోగి లావుగా ఉంటే… అతను స్లిమ్‌గా మారేలా మార్గనిర్దేశం చేసేందుకు కంపెనీ ఒక ట్రైనర్‌ని నియమిస్తుందట.

టిబెట్‌లో బౌద్ధులు పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఇందుకు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా సన్యాసి చనిపోతూ.. పునర్జన్మ పొందాలి అనుకుంటే.. ముందుగా చైనా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాలి. లేదంటే పునర్జన్మపై నిషేధం ఉంటుంది.. పిచ్చంటారండీ దీన్ని..అనిపిస్తుందా..?

నైజీరియాలో విదేశీ హ్యాండ్ కార్ట్‌పై నిషేధం ఉంది. నైజీరియాలో స్థానిక మార్కెట్‌ను ప్రోత్సహించడానికి ఈ నిషేధం ఉంది.

మన దేశంలో చాలా మంది మీమ్స్‌ని తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటారు. అందరూ ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్ట్రేలియాలో అలా జరగదు. మీమ్‌లను షేర్ చేయడంపై అక్కడ నిషేధం ఉంది. మీమ్స్‌లో వాడే ఫొటోలకు కాపీరైట్స్ ఉంటాయి. అందుకే వాటి వాడటంపై నిషేధం విధించారట..! క్రేజీ కదా..!

అమెరికాలో Furbies అని పిలిచే బొమ్మ 90లలో ప్రసిద్ధి చెందింది. ఇది బొచ్చుగల ఎలుగుబంటి లేదా ఏదైనా జంతువు లాగా కనిపిస్తుంది. ఈ మెకానికల్ బొమ్మ మెల్లగా పిల్లల భాష అంటే ఇంగ్లీషు నేర్చుకుంటుంది. ఇందుకోసం పదాలను రికార్డ్ చేసుకుంటుంది. గూఢచారం చేయడానికి శత్రువులు ఈ బొమ్మను ఉపయోగించవచ్చని భావించిన US నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) దీన్ని నిషేధించింది. అన్ని పదాలనూ నేర్చుకోవడానికి ఫర్బీస్‌లో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) లేదు. పిల్లలు మాట్లాడే మాటల్ని మాత్రమే రికార్డ్ చేసి… రిపీట్ చేసేది

ఆడి వెబ్‌సైట్ ప్రకారం.. చైనాలో టైమ్ ట్రావెల్‌పై నిషేధం ఉంది. అది రియల్‌గా కాదు. టైమ్ ట్రావెల్ టాపిక్‌తో వచ్చే సినిమాలపై ఈ బ్యాన్ అమలవుతోంది. ఇలాంటి సినిమాలు చరిత్రను తారుమారు చేస్తున్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news