అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు శుభవార్త.. ఇకపై వారందరికీ పాలు!

-

తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు శుభవార్త. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు బాలామృతం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి దానితోపాటు 1 నుంచి 3ఏళ్ల పిల్లలకు 200 మి.లీ. వరకు పాలు ఇవ్వాలని భావిస్తోంది.

అదేవిధంగా అంగన్వాడి సిబ్బంది రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచడం, మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారుజామున 7:30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news