మనుషులకే కాదు.. కుక్కలకు కూడా విగ్గులొస్తున్నాయ్..!

-

ఈ రోజుల్లో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. శునకాల్ని ఇష్టపడేవారికి అవే ప్రపంచంగా మారిపోతాయి. ఖాళీ సమయాల్లో వాటితో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆఫీసులో కష్టపడి ఇంటికి రాగానే.. ఎంతోప్రేమగా కుక్కలు వచ్చి ముద్దాడతాయి. వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తే.. అలసట అంతా పోతుంది. మనల్ని అవి ఎంత మిస్ అవుతున్నాయో భలే చూపిస్తాయి కదా.. రాగానే.. మీదపడి ముద్దులు పెట్టస్తాయి.

నిశ్వార్థమైన ప్రేమ, నిజాయితి, విశ్వాసంకు కుక్కలు నిలువెత్తు నిదర్శనం. అయితే మనం ఫోటోషూట్ లు పెట్టుకుంటాం.. అలేగా కుక్కల యజమానులు కూడా వాటికి డ్రెస్సులు వేసి.. మంచి ఫోటోలు తీస్తుంటారు. ఈ క్రమంలోనే కుక్కలు ఇంకా అందంగా కనిపించాలని కుక్కలకు విగ్గుల్ని పెట్టి మరీ.. ఫోటోలు దింపేస్తున్నారట..! కుక్కలకు ఎక్కువ హెయిర్ ఉంటేనే కదా.. క్యూట్ గా కనిపిస్తాయి.

అందమైన అమ్మాయిలు రకరకాల హెయిర్‌స్టైల్స్‌ వేసుకున్నట్లే శుకనాలకు వేయాలన్న ఉత్సాహంతో- మనుషులకు పెట్టే విగ్గుల్నే వాటికీ పెట్టి ఫొటోలు తీయడం మొదలుపెట్టారట. ఆ క్రేజ్‌ చూశాక… కంపెనీలకు ఆలోచన రాకుండా ఉంటుందా… ఇక అచ్చంగా కుక్కలకోసమే విగ్గుల్ని చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిని రకరకాల సైజుల్లోనూ రంగుల్లోనూ విగ్గులను తయారుచేస్తున్నాయి. అయితే అచ్చం మనుషుల్ని తలపించేలాంటి విగ్గులే చాలామందికి నచ్చుతున్నాయి. దాంతో సినిమాల్లో హీరో హీరోయిన్లకు సందర్భాన్ని బట్టి రింగుల జుట్టూ స్ట్రెయిట్‌ హెయిరూ ఉన్నట్లే కుక్కలకీ రకరకాల హెయిర్‌స్టైల్స్‌ని తలపించే విగ్గుల్ని చేస్తున్నారు.

వీటిల్లో పొట్టి, పొడవు కేశాలతోపాటు పోనీటెయిల్‌, ముడి, క్రాఫ్‌… ఇలా చాలానే వస్తున్నాయి. భలే క్రేజీగా ఉంది కదా.. ఈ విగ్గుల్ని కూడా ఆట్టే శ్రమ లేకుండా నేరుగా తలమీద పెట్టేసి కిందకి ముడేస్తే సరి. అప్పటివరకూ మామూలుగా ఉన్న కుక్కపిల్ల కాస్తా క్యూట్‌ లుక్స్‌తో భలే వింతగా కనిపిస్తుంది.

ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌ లైక్స్‌ పెంచుకునేందుకూ చాలామంది తమ డాగీలకి డ్రెస్సులు వేసి అచ్చం మోడల్స్‌లా తయారుచేస్తున్నారు. పట్టుకుచ్చులాంటి బొచ్చు ఉన్న పూడుల్‌, కొమొండోర్‌, యోర్క్‌షైర్‌… జాతి కుక్కలకైతే వాటి జుట్టుతోనే ఎన్ని రకాల జడలయినా వేయొచ్చు. కానీ అన్నింటికీ అంత అందమైన జుట్టు ఉండదు కదా… అందుకే వాటికోసం వస్తోన్న విగ్గుల్ని తగిలిస్తున్నారు.

నిజానికి శునకప్రియులు ఇదంతా సరదా కోసమే చేసినప్పటికీ, ముద్దుగా అనిపించే జంతువుల బొమ్మల్ని చూడటం మనిషి మానసిక ఆరోగ్యానికీ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆ ఫొటోల్ని చూడటంవల్ల ఏకాగ్రత పెరుగుతుందనీ ఉత్సాహంగా పనిచేస్తారనీ సైంటిఫిక్ గ్రా కూడా ప్రూవ్ అయింది. పసిపిల్లల ఫొటోల్ని చూసినప్పుడు ఎలాంటి ఫీల్‌ కలుగుతుందో వీటిని చూసినప్పుడూ కూడా అలానే అనిపిస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news