వార్నింగ్ ఇచ్చిన వాడ్ని చంపేసిన ట్రంప్…!

-

శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేసిన దాడి ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తుంది. అమెరికా ప్రత్యర్ధిగా మారిన ఇరాన్ లో అత్యంత శక్తివంతుడు గా ఉన్న ఖుద్స్‌ ఫోర్స్‌ జనరల్‌ ఖాసీం సులేమానిని చంపేసింది అమెరికా. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారిగా షాక్ కి గురైంది. గత కొన్ని రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య వాతావరణం వేడెక్కింది. యుద్ధం వస్తుంది ఏమో అనే సందేహాలను కూడా కలిగాయి.

ఈ నేపధ్యంలో ఖాసిం అమెరికాకు నేరుగా వార్నింగ్ లు ఇవ్వడంతో చర్చనీయంశంగా మారింది. నాలుగుదేశాలను ఖాసిం శాసిస్తూ ఉంటారు. ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఖాసీం సులేమాని నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్‌ ట్రంప్‌ అంటూ సంబోదిస్తూ ఓ జూదగాడా, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నామంటూ చెప్తూ… ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు,

నువ్వు యుద్ధం మొదలుపెడితే మేము యుద్ధాన్ని ముగిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి అమెరికా అతన్ని టార్గెట్ చేసింది. డిసెంబర్ 28 న అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్, ఇరాక్ లో హత్యకు గురి కావడంతో ఆగ్రహించిన అమెరికా సైన్యం కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఖాసిం కి మద్దతుగా ఉండే షియా బృందాలు దాడులు చేసాయి.

దీనితో వారిని ఖాసిం వెనుక ఉండి నడిపిస్తుంది అనే అనుమానంతో రంగంలోకి దిగిన అమెరికా ఇరాక్ లో తమ పట్టు కోల్పోకుండా ఉండాలి అంటే ఖాసిం ని చంపాలని నిర్ణయం తీసుకుని, సిరియా లేదా లెబనాన్ నుంచి ఆయన విమానంలో వస్తున్నట్టు గుర్తించిన అమెరికా బలగాలు, షియా మిలిటెంట్‌ గ్రూప్‌ అధినేత మహా౦ది ని కూడా కలుస్తున్నట్టు తెలుసుకుని, దిగి బయటకు రాగానే దాడి చేసింది. దీనితో ఇరాన్ అమెరికా మధ్య యుద్ద వాతావరణం మరింత వేడెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news