అయ్యో.. ఈ వ్య‌క్తికి పుర్రె లేదేంటి.. అస‌లు ఏమైందంటే..?

-

కొంద‌రు పేషెంట్ల‌ను చూస్తే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకపోతాం. ఎందుకంటే వారిలో చాలా మందికి రెండు చేతులు లేదా రెండు కాళ్లు చాలా వింత‌గా ఉంటాయి. ఇంకొంద‌రైతే ఆకార‌మే చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా మ‌నం ఇలాంటి డిఫ‌రెంట్ వ్య‌క్తి గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మీరు విన్న మ‌నుషులంద‌రికంటే కూడా ఈయ‌న చాలా డిఫ‌రెంట్ వ్య‌క్తి. అవునండి మీరు విన్న‌ది నిజ‌మే. ఈ మ‌నిషి నిజంగానే చాలా డిఫ‌రెంట్ గా ఉంటాడండి. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో ఇప్పుడు తెల‌సుకుందాం.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ ప్రాంతంలో ఉండే కీర్తి పార్మర్ కి కొన్నేళ్ల కింద బ్రెయిన్ ట్యూమర్ అదేంన‌డి మెదడులో గడ్డ లాంటి వ్యాధి వ్యాపించింది. దీంతో కుటుంబీకులు ఆయ‌న‌కు ఇండోర్‌లోని ఒ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించారు. కాగా డాక్ట‌ర్లు వెంట‌నే ఆయ‌న బ్రెయిన్‌లో ఉన్న ట్యూమర్ తొలగించకపోతే పార్మ‌ర్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఇక ఇందులో భాగంగా ఆయ‌న‌కు ఆపరేషన్ ను చేశారు.

అయితే ఈ ఆప‌రేష‌న్ చేసే క్ర‌మంలో పుర్రెలో కుడివైపు భాగాన్ని పగలగొట్టి మ‌రీ ఆ ట్యూమర్ ను విజ‌య‌వంతంగా డాక్ట‌ర్లు తొలగించారు. ఇక ఆప‌రేష‌న్ త‌ర్వాత పగలగొట్టిన పుర్రెను మ‌ళ్లీ విజ‌య‌వంతంగా అతికిస్తామన్నారు డాక్ట‌ర్లు హామీ కూడా ఇచ్చారు. అయితే అతికించకుండానే చర్మాన్ని కుట్టేశారు డాక్ట‌ర్లు. ఎందుకంటే ఆ పుర్రె ముక్క అతికించ‌క ముందే ముక్కలైపోయిందనీ కాబ‌ట్టి దాన్ని తిరిగి అతికించ‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయ‌న పుర్రె లేకుండానే బ్ర‌తుకుతున్నారు. కాగా కుటుంబీకులు మాత్రం డాక్ట‌ర్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news