పాకిస్తాన్: జుట్టు పొడుగ్గా ఉందని టీచర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

-

పాకిస్తాన్ కి చెందిన అబుజర్ మధు అనే ఆర్టిస్టుని పోలీసులు అరెస్టు చేసారు. దానికి కారణం జుట్టు పొడుగ్గా ఉందని చెప్పారు. అవును, మీరు విన్నది కరెక్టే. జుట్టు పొడవుగా ఉందని లాహోర్ పోలీసులు టీచర్ ని అరెస్ట్ చేసిన వైనం ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై అబుజర్ స్నేహితుడు నటాషా ట్విట్టర్ ద్వారా విశేషాలు పంచుకున్నారు.

టీచర్/ పాకిస్తాన్

ఆర్టిస్టు, టీచర్ అయిన అబుజర్ అర్థరాత్రి 3గంటలకు వీధి బయట ఆటో రిక్షా కోసం ఎదురుచూస్తున్నాడు. సడెన్ గా అక్కడికి పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన పోలీసులు అబుజర్ వైపు వస్తూ జీపు ఎక్కమని బలవంతం చేసారు. ఎందుకు అని ప్రశ్నించగా, బెదిరిస్తూ నీ జుట్టు చాలా పొడుగ్గా ఉంది, స్టేషన్ కి వెళదాం పద అన్నారు. జుట్టు పొడుగ్గా ఉంటే స్టేషన్ కి ఎందుకు రావాలని ఎదురు ప్రశ్నిస్తే, అర్థరాత్రి పూట వీధి బయట నిల్చున్నావని, అది తప్పని పోలీస్ స్టేషన్ ని తీసుకెళ్ళారు.

నేను టీచర్ అనీ, పిల్లలకి పాఠాలు బోధిస్తానని ఐడీ కార్డు చూపించినా వాళ్ళు వినలేదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ఒకరోజంతా లాకప్ లో ఉంచారు. అబుజర్ ఈ విషయాన్ని తన స్నేహితులకి ఫోన్ చేసి పంచుకున్నాడు. తెల్లవారిన తర్వాత స్నేహితులు స్టేషన్ కి వచ్చారు. ఏం జరిగిందని పోలీసుని అడిగితే, జుట్టు పొడుగ్గా ఉందని, అందుకే అరెస్ట్ చేసామని సమాధానం ఇచ్చారు. అలా ఎలా చేస్తారని అడగ్గా దానికి ఎలాంటి సమాధానం రాకపోగా ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. ఈ మేరకు ఈ సమాచారమంతా అబుజర్ స్నేహితుడు నటాషా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news