కాసేపట్లో హైదరాబాద్‌కు ఈటల.. శంషాబాద్ ఎయిర్ పోర్టు బయట ఉద్రిక్తత

హైదరాబాద్: కాసేపట్లో ఈటల రాజేందర్ నగరానికి రానున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరారు. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, ఈటల అభినులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకుంటున్నారు. కరోనా కారణంగా భారీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను ఎయిర్ పోర్టు బయట అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల వాగ్వాదం చోటు చేసుకుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో అన్ని వైపులా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను చెక్ పోస్టుల వద్దే అడ్డుకుంటున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి ఈటల రాజేందర్ హైదరాబాద్ వస్తున్నారు. ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ లోకి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అనుమతించడంలేదు. దీంతో ఎయిర్ పోర్టు బయట రోడ్డు మార్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.