Parenting tips: ఈ లైఫ్ స్కిల్స్ ని మీ పిల్లలకు నేర్పడం చాలా ముఖ్యం..!

-

మనం చిన్న పిల్లల్ని బాగా గారాభం చేస్తూ ఉంటాము పైగా వాళ్ళు పెద్దయ్యాక అన్ని నేర్చుకుంటారు కదా ఇంకా ఇప్పుడు వాళ్ళ వయసు చిన్నది కదా అని భావిస్తూ ఉంటారు. కానీ అది అలా చేయటం మంచిది కాదు. ఎప్పుడూ కూడా పిల్లలకి ఈ విషయాలను నేర్పిస్తూ ఉండాలి లేదంటే పిల్లలు ఎప్పటికీ వాటిని నేర్చుకోలేరు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకే కొత్త కొత్త విషయాలు తల్లిదండ్రులు పరిచయం చేస్తూ ఉండాలి. పైగా కొన్ని పనులను కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. అయితే మరి పిల్లలకి మీరు ఈ లైఫ్ స్కిల్స్ నేర్పుతున్నారా లేదా చూసుకోండి.

వంట లో ఇన్వాల్వ్ చేయడం:

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన విషయాలు చెప్పరు కానీ స్టవ్ వెలిగించకుండా చేయాల్సిన ఆహారపదార్థాలను వాళ్ళకి చెప్పొచ్చు. ఉదాహరణకి నిమ్మరసంలో నీళ్లు కలపడం ఇలాంటివి వాళ్ళకి చెప్పచ్చు. ఇలా వాళ్ళూ నేర్చుకుంటారు. వంట గదిలో సామాన్లు ఎలా సద్దుకోవాలి ఇలాంటివి చిన్న చిన్న పన్నులను వారితో మీరు చెప్పి నేర్పించవచ్చు.

అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండటం:

పిల్లలు ఏది అడిగితే తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి అవసరమైనవి ఏవి..?, వీటిని కొనుగోలు చేయాలి ఏమి అవసరం లేదు అనే వాటిని తెలపాలి. అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు.

సోషల్ స్కిల్స్:

ఎప్పుడు ఫోన్ లో టీవీ లో మునిగిపోకుండా ఇతరులతో మాట్లాడటం, ఆడడం వంటివి నేర్పించాలి. ఇప్పుడు అందరితో కలిసి ఉంటే వాళ్ళకి భయం ఉండదు. అలానే అందరితోనూ మాట్లాడటం వస్తుంది. పెద్దలతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా మాట్లాడాలి వంటివి వాళ్ళకి తెలుస్తాయి.

క్రమశిక్షణ నేర్పండి:

పిల్లలకి ఏది ఎలా ఉంచుకోవాలి..?, వేటిని ఫాలో అవ్వాలి అనేది తెలపాలి. ఇలా మీ పిల్లలకు వీటిని నేర్పితే కచ్చితంగా వాళ్ళకి అన్ని తెలుస్తాయి పైగా భవిష్యత్తులో సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news